కుర్ర హీరోలంతా మంచు లక్ష్మికి భయపడతారట  

Unknown Facts About Manchu Lakshm-manchu Manoj,manchu Vishnu,mohan Babu,tollywood Box Office,tollywood Celebrities

మంచు లక్ష్మి ప్రస్తుతం ఒక టాక్‌ షోను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.గతంలో కూడా మంచు వారి అమ్మాయి టాక్‌ షోలను నిర్వహించింది.కాని గతంతో పోల్చితే ఈసారి చాలా పాపులర్‌ అవుతోంది.యంగ్‌ హీరోలు మరియు హీరోయిన్స్‌తో ఈమె చేస్తున్న చిట్‌ చాట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలలో వైరల్‌ అవుతున్నాయి.ఇప్పటికే ఈమె సమంత, రకుల్‌, శృతిహాసన్‌లతో ఇంటర్వ్యూలు చేసింది.ఆ ఇంటర్వ్యూలో కొన్ని టాపిక్స్‌ సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌ అయ్యాయి.

Unknown Facts About Manchu Lakshm-manchu Manoj,manchu Vishnu,mohan Babu,tollywood Box Office,tollywood Celebrities-Unknown Facts About Manchu Lakshm-Manchu Manoj Manchu Vishnu Mohan Babu Tollywood Box Office Tollywood Celebrities

ఇటీవల ఎపిసోడ్‌లో మంచు లక్ష్మి యంగ్‌ హీరో నిఖిల్‌ను ఇంటర్వ్యూ చేసింది.ఈ సందర్బంగా నిఖిల్‌ నుండి పలు విషయాలను ఈమె రాబట్టింది.ఈ టాక్‌ షోలో మంచు లక్ష్మి సెలబ్రెటీల లవ్‌ అఫైర్స్‌ గురించి రాబడుతూ వచ్చింది.

Unknown Facts About Manchu Lakshm-manchu Manoj,manchu Vishnu,mohan Babu,tollywood Box Office,tollywood Celebrities-Unknown Facts About Manchu Lakshm-Manchu Manoj Manchu Vishnu Mohan Babu Tollywood Box Office Tollywood Celebrities

అలాగే నిఖిల్‌ లవ్‌ అఫైర్‌ గురించి కూడా రాబట్టింది.నిఖిల్‌ ఈ సందర్బంగా మాట్లాడుతూ యంగ్‌ హీరోలు ఎవరైనా కూడా మంచు లక్ష్మి ఏదైనా షోకు ఆహ్వానిస్తే రావాల్సిందే.లేదంటే వారికి చుక్కలు చూపిస్తుందని సరదాగా వ్యాఖ్యలు చేశాడు.

మంచు ఫ్యామిలీ వారితో అంతా మంచి రిలేషన్‌ షిప్‌ను మెయింటెన్‌ చేయాలని అనుకుంటారు.అందుకే ఆమె ఆహ్వానిస్తే తప్పకుండా వస్తారని ఆ తర్వాత మళ్లీ చెప్పాడు.ఇక హ్యాపీడేస్‌ చిత్రం తర్వాత తనకు వచ్చిన గుర్తింపు కారణంగా పలువురు నిర్మాతలు నాతో సినిమాలు చేయాలని వచ్చారు.

కాని చాలా మంది సినిమాను మొదలు పెట్టి ఆర్థిక ఇబ్బందులు అంటూ వదిలేశారు.ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.నాతో సినిమాలు చేయాలనుకునే వారు ఎంత బడ్జెట్‌ పెట్టేందుకు అయినా సిద్దపడుతున్నారని నిఖిల్‌ చెప్పుకొచ్చాడు.