బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటి "భానుశ్రీ" గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా.?       2018-06-11   00:51:06  IST  Raghu V

బిగ్ బాస్ రెండో సీజన్లో మొదలయ్యింది. కొత్త కంటెస్టెంట్స్ తో ఘనంగా ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ లోని ఒక భామ పై కుర్రకారు మనసు పారేసుకుంది. ఆమె గురించి ఇంటర్నెట్ లో వెతకడం మొదలుపెట్టింది. ఆమె భానుశ్రీ. అసలు ఆమె ఎవరు.? ఏ సినిమాలో నటించింది.?

-

బిగ్ బాస్ హౌజ్‌లోకి టాలీవుడ్ భామ భానుశ్రీ ఎంటరైంది. సీజన్ – 2లో హౌజ్‌లోకి వచ్చిన ఐదో వ్యక్తి ఈమె. టాలీవుడ్‌లో ఇద్దరి మధ్య 18 సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించింది. ఈమెను భాను త్రిపాఠి అని కూడా పిలుస్తుంటారు. ప్రముఖ ఛానల్‌లోని గోల్డ్ రష్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు భాను.

-

ఆమె గురించి మరొక ఆసక్తికర విషయం కూడా ఇక్కడ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది మన రాజమౌళి గారు తీసిన తెలుగు సినిమా “బాహుబలి”. రాజమౌళి గారు తీసిన బాహుబలికి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. ప్రభాస్, రానా లకు మంచి పేరు తెచ్చిపెట్టండి “బాహుబలి” సినిమా. దేవసేనగా “అనుష్క”, శివగామిగా “రమ్యకృష్ణ” ఆక్టింగ్ అయితే పీక్స్ అనే చెప్పాలి. కానీ “అవంతిక”గా చేసిన “తమన్నా” పాత్రమాత్రం “బాహుబలి- 2 ” లో కేవలం ఒక ఫ్రేమ్ కి మాత్రమే పరిమితమయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్ల్స్ కూడా వచ్చాయి.

ఇది పక్కన పెడితే…బాహుబలి – 1 లో “అవంతిక” కు ఫ్రెండ్ గా ఓ అమ్మాయి నటించింది. ఆమె తమన్నాకు డూప్ గా కూడా నటించింది తెలుసా. ఆక్షన్ సన్నివేశాల్లోనే కాదు. సాంగ్స్ లోను తమన్నాకు డూప్ గా ఆమె చేసింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..? ఆమె “భానుశ్రీ” “లక్ష్మీదేవికి ఓ లెక్క ఉంది”, “కుమారి – 21 ఎఫ్” అనే సినిమాల్లో కూడా నటించింది “భానుశ్రీ”

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.