సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్న లోకులు కాకులు ఆంటీ గురించి ఎవరికి తెలియని విషయాలు  

 • సోషల్‌ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి లోకులు కాకులు ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఈమె గురించి వినని వాళ్లు యూట్యూబ్‌ లేదా ఫేస్‌బుక్‌ లేదా మరే ఇతర సోషల్‌ నెట్వర్కింగ్‌ సైట్‌లో అయినా చెక్‌ చేసుకోండి. ఈమె వీడియోలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతూ ఉంటాయి. యూత్‌ ఈమెను ఒక స్టార్‌ చేశారు. అదే సమయంలో కొందరు ఈమెను జోకర్‌ మాదిరిగా చేశారు.

 • Unknown Truths About Lokulu Kakulu Aunty In Social Media-Lokulu Viral Media Who Is

  Unknown Truths About Lokulu Kakulu Aunty In Social Media

 • పిచ్చిదాని మాదిరిగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడట, కాస్త తేడాగా మాట్లాడటం ఆమె నైజం. అందుకే ఆమె సోషల్‌ మీడియాలో సెలబ్రెటీ అయ్యింది. చూడ్డానికి విభిన్నంగా ఉండే ఆమె ప్రస్తుతం యూత్‌కు ఒక ఐటెం మాదిరిగా అయ్యింది. ఆమెతో సెల్ఫీలు తీసుకోవాలని కూడా ఎంతో మంది ఆరాట పడుతూ ఉంటారు. అమీర్‌ పేటలోని మైత్రీవనం, సనత్‌నగ్‌, ఎర్రగడ్డ, కూకట్‌ పల్లి ఇలాంటి సందడి ఉండే ఏరియాల్లో ఉంటూ ఉంటుంది.

 • లోకులు కాకులు ఆంటీ గురించి సోషల్‌ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం…

 • Unknown Truths About Lokulu Kakulu Aunty In Social Media-Lokulu Viral Media Who Is
 • లోకులు కాకులు ఆంటీ అసలు పేరు జ్యోతి. ఆమెకు ఇంటర్మీడియట్‌ చదివే కొడుకు తప్ప మరెవ్వరు లేకుండే. రెండేళ్ల క్రితం ఆ కొడుకు కూడా యాక్సిడెంట్‌ లో చనిపోయాడు. దాంతో అప్పటి నుండి కాస్త మతిభ్రమించింది. అయినా కూడా నలుగురితో సరిగా మాట్లాడటంతో పాటు, 15 నుండి 25 ఏళ్ల వయస్సు ఉన్న వారిలో తన కొడుకును చూసుకుంటూ ఉంటుంది. ఆంటీ అంటే అమ్మ అనురా నా కొడుక అంటూ ఆప్యాయంగా మందలిస్తుంది. సెల్ఫీలు, గిల్ఫీలు తీసుకోవద్దురా, మంచిగా అమ్మ అనురా నన్ను అంటూ అందరితో ఆప్యాయంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది.

 • Unknown Truths About Lokulu Kakulu Aunty In Social Media-Lokulu Viral Media Who Is
 • ఇక ఆమె మానసిక పరిస్థితి గురించి తెలిసిన వారు కొందరు ఆమెతో రాజకీయాల గురించి మాట్లాడించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఏపీలో జగన్‌ అంటుంది, మరి కొన్ని సార్లు చంద్రబాబు గ్రేట్‌ అంటుంది. ఇక తెలంగాణలో కేసీఆర్‌ గారు గ్రేట్‌ అంటుంది. కేటీఆర్‌ నన్ను పిలిచి మాట్లాడాడు అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. ఎన్నో వేళ మంది ఈమెను కలిసి మళ్లీ మళ్లీ కలవాలనుకుంటున్నారు. ఆమెకు తినేందుకు తిండి కూడా ప్రతి రోజు ఎవరో ఒకరు పెట్టించాల్సిందే. ఉండేందుకు నీడ లేదు.
  ఈ వీడియో కోసం క్లిక్ చేయండి
  ఆమె ఫుట్‌ పాత్‌పై పడుకుంటుంది. అత్యంత దారుణమైన జీవితం ఆమె గడుపుతుంది. ఎవరైనా మాతో అని అడిగినా కూడా ఆమె రానంటుంది. తాను ఇదే జీవితాన్ని గడుపుతానంటూ చెబుతుంది. మొత్తానికి లోకులు కాకులు ఆంటీ జీవితం ఎంతో దయనీయంగా సాగుతుంది. ముందు ముందు ఆమె జీవితం ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.