ఈ లేడి IPS ఆఫీసర్ రియల్ స్టోరినే సినిమాగా తీసారు.! ఆమె గురించి ఈ 10 విషయాలు తెలుస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే.!   ఈ లేడి IPS ఆఫీసర్ రియల్ స్టోరినే సినిమాగా తీసారు.! ఆమె గురించి ఈ 10 విషయాలు తెలుస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే.!     2018-11-06   11:49:57  IST  Sainath G

సినిమాలు సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. కొంత మంది దర్శకులు కాల్పనిక కథలతో సినిమాలు తీస్తే మరికొందరు నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాలు తీసి జనాల చేత చప్పట్లు కొట్టిస్తారు. అయితే ఇలా వాస్తవ పరిస్థితులను ఆధారంగా చేసుకుని తీసే సినిమాల్లో అధిక శాతం వరకు ఏదైనా సంఘటన లేదా ఎవరైనా ఒక వ్యక్తి జీవితాన్ని ప్రతిబింబించే సినిమాలే ఉంటాయి. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది జై గంగాజల్ సినిమా. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పోషించిన పవర్‌ఫుల్ పోలిసాఫీసర్ పాత్ర తెలుసు కదా! అవును, ఇప్పుడు ఆ పాత్ర గురించే మేం చెప్పబోయేది. అయితే ఈ క్యారెక్టర్ మాత్రం కల్పన కాదు. ఓ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ యదార్థ గాథను ఆధారంగా చేసుకుని నిర్మించిన పాత్ర అది. దాన్ని ప్రియాంక చోప్రా జై గంగాజల్ సినిమాలో పోషించి అందరి ప్రశంసలను అందుకున్నారు. అయితే ఆ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో కాదు, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇషా పంత్. ఆమె గురించి ఆసక్తికర విషయాలు ఇవే.

1. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన ఇషా పంత్ 1984 జూన్ 23న జన్మించింది. ఈమె తండ్రి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)లో పనిచేసి రిటైరయ్యారు. కాగా ఆయనకు ఉన్న నలుగురు కూతుళ్లలో ఇషా పంత్ అందరి కంటే చిన్నది.

Unknown Things About IPS Isha Pant Jai Gangaajal Movie-

2. ఇషా పంత్ పెద్ద అక్క ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్‌గా, ఇంకో అక్క హ్యూమన్ రీసోర్స్ ప్రొఫెషనల్‌గా, 3వ అక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో స్కాడ్రన్ లీడర్‌గా పనిచేస్తున్నారు.

Unknown Things About IPS Isha Pant Jai Gangaajal Movie-

3. వీరంతా అత్యున్నత స్థానాల్లో కొనసాగుతుండగా తాను కూడా దేశానికి సేవ చేసే ఐపీఎస్ ఆఫీసర్‌గా రాణించాలనుకుంది. ఈ నేపథ్యంలోనే కష్టపడి చదివి యూపీఎస్‌సీ పరీక్షల్లో దేశవ్యాప్తంగా 191వ ర్యాంక్ సాధించింది. దీంతో ఐపీఎస్‌కు సెలెక్ట్ అయింది.

Unknown Things About IPS Isha Pant Jai Gangaajal Movie-

4. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇషా పంత్ ఐపీఎస్ శిక్షణను పూర్తి చేసుకుంది. అనంతరం 2011లో మధ్యప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ బ్యాచ్‌లో జాయిన్ అయింది.

Unknown Things About IPS Isha Pant Jai Gangaajal Movie-

5. ఇలా జాయిన్ అవగానే ఆమె జబల్‌పూర్ అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టింది. అనంతరం ఆమెను గ్వాలియర్‌కు బదిలీ చేశారు.

Unknown Things About IPS Isha Pant Jai Gangaajal Movie-

6. 2012లో బెస్ట్ ఆల్ రౌండ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ప్రొబెషనర్‌గా ఆమె అవార్డును అందుకుంది.

Unknown Things About IPS Isha Pant Jai Gangaajal Movie-

7. దీంతోపాటు సర్దార్ వల్లభాయ్ అకాడమీలో జరిగిన 64వ దీక్షంత్ పరేడ్‌లో ప్రైమ్ మినిస్టర్ బ్యాటన్, హోమ్ మినిస్ట్రీ రిసాల్వర్‌గా పేరు దక్కించుకుంది.

Unknown Things About IPS Isha Pant Jai Gangaajal Movie-

8. కాగా జబల్‌పూర్‌లో పోస్టింగ్ వచ్చిన ఆరంభం నుంచే ఆమె ఎన్నో కేసులను అవలీలగా పరిష్కరించింది. స్థానికంగా బలపడి ఉన్న డ్రగ్ మాఫియాల ఆట కట్టించింది. దీంతోపాటు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న అనేక బ్యాచ్‌లను, గూండాలను తరిమికొట్టింది.

Unknown Things About IPS Isha Pant Jai Gangaajal Movie-

9. ఇషా పంత్ భర్త కర్ణాటకకు చెందిన క్యాడర్‌లో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇషా పంత్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని దర్శక నిర్మాత ప్రకాష్ ఝా జై గంగాజల్ సినిమాను తీశారు. ఇందుకోసం ఆయన స్వయంగా ఆమెను కలిసి తన కథ కోసం ఆమె నుంచి అనుమతి తీసుకున్నారు.

Unknown Things About IPS Isha Pant Jai Gangaajal Movie-

10. అయితే జై గంగాజల్ సినిమా మాట అటుంచితే నిజంగా ఇషా పంత్ జీవితం మాత్రం ఇతర మహిళలకు ఆదర్శమే. ఎందుకంటే నిత్యం ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లతో కూడుకున్న పోలీస్ వృత్తిలో రాణించడమంటే మాటలు కాదు. అలాంటి వృత్తిలో ఆమె రాణిస్తూ తనలా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే మహిళలకు ప్రేరణగా నిలుస్తూ స్ఫూర్తినిస్తోంది.

Unknown Things About IPS Isha Pant Jai Gangaajal Movie-