సినిమాలో నటన ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది.కొందరు నటిస్తుంటే నటిస్తున్నట్లు ఉంటుంది.
మరికొందరు నటిస్తుంటే జీవిస్తున్నట్లు కనిపిస్తుంది.రెండో రకానికి చెందిన నటీమణి జయసుధ.
తన నటనలో సహజత్వం కనిపిస్తుంది.అందుకే తెలుగు సినిమా పరిశ్రమలో సహజ నటిగా పేరు సంపాదించుకుంది.
ఎన్నో భాషల్లో.ఎన్నోసినిమాల్లో నటించిన జయసుధ.
మహానటి సావిత్రి స్థాయిలో కుటుంట నటిగా గుర్తింపు తెచ్చకుంది.జయప్రద, జయసుధ తమ అందచందాలతో కుర్రకారులో సెగలు పుట్టించినా.
జయసుధ మాత్రం కుటుంబ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అందాలను ఆరబోయకున్నా.
మంచి జనాదరణను పొందింది ఈ ముద్దుగుమ్మ.ఇప్పటికీ సినిమాల్లో చక్కటి పాత్రలు పోషిస్తూ కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది.
జయసుధ చెన్నైలో పుట్టి పెరిగింది.ఈమె అసలు పేరు సుజాత.చిన్నప్పటి నుంచే తనకు సినిమా పరిశ్రమతో సంబంధం ఉండేది.ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల ఆమెకు స్వయంగా చిన్నమ్మ.
అందుకే అప్పుడప్పుడూ సినిమా షూటింగులకు వెళ్లేది.అలా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.
ఆరోజుల్లోనే బికీనీ వేసింది జయసుధ.గ్లామర్ కు అసలు నిర్వచనం చెప్పింది.
కానీ.ఆమెను కుటుంబ కథా నాయకిగానే గుర్తింపు పొందింది.
అటు హీరోలు సైతం ఆమెను గ్లామరస్ హీరోయిన్ గా చూడలేదు.అందుకే ఆమె అప్పట్లో కమర్షియల్ సినిమాలను ఎక్కువగా చేయలేదు.
జయసుధకు పెద్ద ఎత్తున అభిమానులు పోగు కావడానికి కారణం ఆమె నటించిన పాత్రలే.తనకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో జీవించేది.ప్రతీపాత్రకు ప్రాణం పోసేది.ఎన్నోమార్లు ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది.ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది.అప్పటి టాప్ హీరోలను సైతం తన నటనా తీరుతో ఆకట్టుకుంది.
ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాలు విజయవంతంగానే ప్రదర్శించడబ్బాయి.ఒకటి అర మాత్రమే ఫ్లాప్ అయ్యాయి.
ఇప్పటికీ తను సినిమాలు చేస్తూనే ఉంది.తెలుగు సినిమా ప్రజలకు మంచి ఆహ్లాదాన్ని పంచుతూనే ఉంది.
జయసుధ భర్త నితిన్ కపూర్ 2017లో గుండెపోటుతో కన్నుమూశాడు.ఆమెకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.
వారితోనే జీవిస్తుంది.