కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ స్వయంగా అన్నదమ్ములు.వీరిద్దరు కలిసి ఓకే బ్యాగ్రాఫ్ లో ఉంటే సినిమాలు చేయాలనుకున్నారు.
ఈ రెండు సినిమాల్లో ఇద్దరూ పోలీసు క్యారెక్టర్ల చేశారు.అయితే కథలు కూడా కాస్త ఒకేలా ఉండటంతో.
ఇద్దరు కలిసి కూర్చున్నారట.రెండు సినిమాల్లో ఒకేలా ఉన్న సీన్లను మార్చారట.
సినిమా కథలు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేశారు.అనంతరం ఇద్దరూ సినిమాలు చేసి
ఆంద్రావాలా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో పూరీ మరో సినిమా చేయాలనుకున్నాడు.
ఇద్దరికీ టైమ్ కుదరలేదు.ఫైనల్ గా ఓ కిక్ బాక్సింగ్ నేపథ్యమున్న కథను పూరీ వివరించాడు జూనియర్ ఎన్టీఆర్ కి.ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పాడు.అదే సమయంలో స్టోరీ రైటర్ వక్కంత వంశీ ఎన్టీఆర్ కు పోలీస్ ఆఫీసర్ కథ చెప్పాడు.
ఈ కథ ఇంకా బాగా నచ్చింది.వెంటనే వంశీ కథ గురించి ఎన్టీఆర్ పూరీకి ఫోన్ చేసి చెప్పాడు.
ఇద్దరు ఓకే అనుకున్నారు.కథ లో కొన్ని మార్పులు చేశారు.తన మార్కు డైలాగులు యాడ్ చేశాడు.సినిమా షూటింగ్ కు రెడీ అయ్యారు.రూ.30 కోట్ల బడ్జెట్ తో సినిమా నిర్మాణానికి బండ్ల గణేష్ ఒకే చెప్పాడు.టెంపర్ అని ఈ సినిమాకు పేరు పెట్టారు.పోలీస్ ఆఫీసర్ గా మొదట నారాయణమూర్తిని అడిగితే కమర్షియల్ సినిమా చేయడానికి నో చెప్పాడు.దీంతో పోసానిని తీసుకున్నారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో సినిమా కార్మికులు సమ్మెకు దిగడంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే ఎన్టీఆర్ అన్న జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో తన సినిమా ఇబ్బంది కావొద్దని తన టెంపర్ మూవీ విడుదలను ఎన్టీఆర్ వాయిదా వేసుకున్నాడు.2015 ఫిబ్రవరి 13న 1,400 వందల థియేటర్లలో సినిమా విడుదలైంది.సూపర్ హిట్ టాక్ వచ్చింది.మొత్తం రూ.50 కోట్లను వసూల్ చేసింది ఈ సినిమా.