తక్కువ ధరకే బంగారు నాణాలు ఇస్తామంటూ పాతిక లక్షలతో జంప్ …  

unknown persons, fake gold coins, Anantapur, crime news - Telugu Anantapur, Crime News, Fake Gold Coins, Unknown Persons

ప్రస్తుతం పోలీసులు, ప్రభుత్వ అధికారులు మనుషులు చేసేటువంటి మోసాలపై నిఘా ఉంచినప్పటికీ  కొందరు కేటు గాళ్లు మాత్రం కొత్త కొత్త దారులు వెతుక్కుంటూనే ఉన్నారు.తాజాగా కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు బంగారు నాణాలను అతి తక్కువ ధరకే విక్రయిస్తామని ఓ వ్యక్తి నుంచి దాదాపుగా 25 లక్షల రూపాయలు కాజేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

 Unknown Persons Doing Fraud With Fake Gold Coins In Anantapur

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి సమీపంలో ఉన్నటువంటి బళ్లారికి చెందిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బంగారు నాణాలను విక్రయిస్తామని కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని అనంతపురం జిల్లాకి రప్పించారు.అనంతరం నకిలీ బంగారు నాణాలను అప్పజెప్పి దాదాపుగా 25 లక్షల రూపాయలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

అయితే ఈ  బంగారు నాణేలను దగ్గరలో ఉన్నటువంటి కంసాలి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి చూపించగా బంగారు నాణాలు నకిలీ అని తేల్చారు.

తక్కువ ధరకే బంగారు నాణాలు ఇస్తామంటూ పాతిక లక్షలతో జంప్ …-Latest News-Telugu Tollywood Photo Image

అతి తక్కువ ధరకే బంగారం దొరికిందంటూ సంబరపడుతూ ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి చివరికి నిరాశే మిగిలింది.

దీంతో బాధితుడు లబోదిబోమంటూ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగినదంతా వివరించి క్రికెట్ వాళ్ల నుంచి తన డబ్బులు తనకు ఇప్పించాలని కోరాడు.

ఈ విషయంపై స్పందించిన పోలీసులు అనవసరంగా అత్యాశలకు పోయి గుర్తు తెలియని వ్యక్తుల మాటలను నమ్మి డబ్బులు గానీ మరే ఇతర వస్తువులను గానీ ఇవ్వొద్దంటూ సూచిస్తున్నారు.

అంతేకాక ఎవరైనా సరే కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు తారస పడితే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

#Anantapur #Unknown Persons #Fake Gold Coins

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Unknown Persons Doing Fraud With Fake Gold Coins In Anantapur Related Telugu News,Photos/Pics,Images..