ఏపీలో కలకలం.. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు..!

గుర్తు తెలియని కొందరు దుండగులు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది.వివరాలలోకి వెళితే.

 Unknown Persons Destroyed The Ysr Statue In Chittoor District-TeluguStop.com

చిత్తూరు జిల్లాలోని గుడుపల్లి మండలం ఓఎన్ కొత్తూరు గ్రామం శివారులో వై ఎస్ఆర్ వివిగ్రహం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.శుక్రవారం ఉదయం అటువైపు వెళ్లిన వారికి ధ్వంసమైన వైఎస్ఆర్ విగ్రహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారని విచారణ చేశారు అక్కడి గ్రామస్తులు వైయస్సార్సీపి కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకోవాలంటూ ఆందోళనకు దిగారు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

 Unknown Persons Destroyed The Ysr Statue In Chittoor District-ఏపీలో కలకలం.. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈమధ్య విగ్రహాలను ధ్వంసం చేయడం ఎక్కువగా చూస్తున్నాం.విగ్రహాలను అడ్డుపెట్టుకొని ఏపీ లోని అనేక ప్రాంతాల్లో ఘర్షణలు కొట్లాటలకు దారితీస్తూ పార్టీల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి.

ఇదిలా ఉండగా చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు ఇలా పలు జిల్లాల్లో స్కూల్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి.అందులో భాగంగా నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు కొండారెడ్డి పల్లిలో స్కూల్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

Telugu Andhra Pradesh, Chittoor District, Chittor District, Latest News, Police, School Chariman Elections, Ycp, Ys Statue, Ysr, Ysr Statue, Ysr Statue Destroyed-Latest News - Telugu

ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసు కోవడంతో వివాదం చెలరేగింది.ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి.దీంతో పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.ఇలా పార్టీల మధ్య గోడవలు చలరేగుతున్నాయి.ఇందులో భాగంగానే ఒకరు పార్టీ విగ్రహ లను మరొకరు మరొక పార్టీ వారు ధ్వంసం చేస్తున్నారు.ఈ కారణంగా కొట్లాటలు ఘర్షణలకు దిగుతున్నారు.

#Andhra Pradesh #School Chariman #YsrStatue #Statue #Chittoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు