పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమ జంటపై దాడి! మళ్ళీ ప్రియుడే హంతకుడు!  

Unknown People Attack Love Couple In West Godavari-

కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లాలో, మంగళగిరిలో జ్యోతి అనే అమ్మాయిని ప్రియుడు శ్రీనివాస్ హత్య చేసి దాడిని ఎవరో దుండగులు దాడి చేసినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు.ఇప్పుడు అలాంటి ఘటన మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాలో కామవరపు కోట పరిధిలో ఓ బౌద్ధ క్షేత్రం సమీపంలో ప్రేమ జంటపై దుండగులు దాడి చేసి శ్రీ ధరణి అనే అమ్మాయిని హత్య చేసారు.

Unknown People Attack Love Couple In West Godavari- Telugu Viral News Unknown People Attack Love Couple In West Godavari--Unknown People Attack Love Couple In West Godavari-

ఇక ఈ దాడిలో నవీన్ అనే ప్రియుడు గాయాలతో బయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

ఇదిలా వుంటే ఈ ప్రేమ జంటపై దుండగులు దాడి చేసి ప్రియురాలు శ్రీధరణిని చంపేయడం, ప్రియుడు నవీన్ ని గాయాలతో వదిలేయడం చూస్తూ వుంటే ఇది కూడా జ్యోతి మర్డర్ తరహాలోనే జరిగింది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ కేసు విచారణని జిల్లా ఎస్పీ టేకప్ చేసి విచారణ మొదలెట్టారు.ఇక ప్రియుడే ఈ హత్య చేసి ఉంటాడు అనే కోణంపైనే పోలీసులు ద్రుష్టి పెట్టారు.

ఇక ఈ కేసులో నవీన్ ని విచారించే ప్రయత్నం చేసిన పోలీసులకి అతను ముందుగా ధరణి ఎవరో తెలియదని చెప్పి, తరువాత తనకి అక్కడే పరిచయం అయ్యింది అని, ఇద్దరం కలిసి కొండపైకి వెళ్లామని చెప్పడం చూస్తుంటే ప్రియుడుగా చెప్పబడుతున్న నవీన్ ఆమెని హత్య చేసి ఉంటాడనే ప్రాధమిక నిర్ధారణకి పోలీసులు వచ్చారు.మరి ఈ కేసులో విచారణలో ఎలాంటి ముగింపు వస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

.

తాజా వార్తలు

Unknown People Attack Love Couple In West Godavari Related....