విషాదం : జాను సినిమా చూస్తూ వ్యక్తి మృతి...

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది.ఓ వ్యక్తి నిన్నటి రోజున విడుదలైనటువంటి యంగ్ హీరో శర్వానంద్, టాలీవుడ్ గ్లామరస్ క్వీన్ సమంత నటించిన టువంటి జాను ఈ చిత్రాన్ని చూడడానికి వచ్చిన ఓ వ్యక్తి  సినిమా థియేటర్ లోనే మరణించాడు.

 Unknown Movie Dead In Movie Theater At Hyderabad-TeluguStop.com

ఈ ఘటన నగరంలోని ఎర్రగడ్డ  ప్రాంతంలో ఉన్నటువంటి గోకుల్ థియేటర్లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి  జాను సినిమా చూడడానికి ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి గోకుల్ సినిమా థియేటర్ కి వచ్చాడు.

 Unknown Movie Dead In Movie Theater At Hyderabad-విషాదం : జాను సినిమా చూస్తూ వ్యక్తి మృతి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా టికెట్ తీసుకొని మ్యాట్నీ షోకి వెళ్ళాడు.అయితే సినిమా అయిపోయినప్పటికీ ఎంత సేపటికీ అతడు బయటికి రాకపోవడంతో థియేటర్ నిర్వాహకులు ఏమైందో అని వెళ్లి చూడగా అతడు మృతి చెందినట్లు తెలుసుకున్నారు.

దీంతో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.అయితే అతడి వివరాలకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో వృత్త దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.

అయితే ఈ వ్యక్తి మృతిపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు సినిమా చూసే సమయంలోమృతుడి పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులను  విచారిస్తున్నారు.అయితే ఈ ఈ గుర్తు తెలియని వ్యక్తి మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

#HyderabadLocal #MovieTheater #HyderabadLatest #HyderabadCrime

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు