ఎన్టీఆర్ హయాంలో టిఫిన్ ధరను తగ్గించారు.. దోష ఎన్ని పైసలో తెలుసా?

సినిమాల్లో స్టార్ హీరోలు ప్రేక్షకులకు దగ్గర అయ్యి ఇక ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకున్న సినిమా హీరోలు చాలామంది ఉన్నారు.కానీ ఎంతమంది ఇలా సినిమాలో నుంచి రాజకీయాల్లోకి వచ్చినా అటు నందమూరి తారక రామారావు గుర్తింపు మాత్రం ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి.

 Unknown Interesting Facts About Sr Ntr Details, Senior Ntr, Tiffin Prices, Doas,-TeluguStop.com

తెలుగు సినీ ప్రేక్షకులకు తెలుగు ప్రజలందరికీ కూడా ఇప్పటికీ ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం.ఆయన తుది శ్వాస విడిచి సంవత్సరాలు గడిచిపోతున్న ఇప్పటికీ ఆయన పేరు చెబితే చాలు ఎనలేని గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు తెలుగు ప్రజలు.

ఇక ఇంతలా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవటానికి కేవలం ఆయన హీరోగా మాత్రమే కాదు ఒక గొప్ప ముఖ్యమంత్రిగా పాలన సాగించడం కూడా కారణం అని చెప్పాలి.

సినిమాల్లో తిరుగులేని హీరోగా కొనసాగి ఇక తెలుగు సినీ ప్రేక్షకులు అందరికి కూడా కృష్ణుడిగా రాముడిగా కనిపించే దేవుడు గా మారిపోయిన ఎన్టీఆర్ అటు టిడిపి పార్టీ స్థాపించి తెలుగు రాజకీయాల్లో సంచలనం మార్పులు తీసుకువచ్చారు.

పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే తిరుగులేని చరిష్మా కొనసాగిస్తున్న కాంగ్రెస్ను ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు ఎన్టీఆర్.పేదల ప్రభుత్వం గా పాలన సాగించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ నటసార్వభౌముడు ఎన్టీఆర్ గుర్తింపు సంపాదించుకున్నారు.

అయితే ఎన్టీఆర్ సీఎం అయిన తొలి రోజులలో ఆయన తీసుకున్న నిర్ణయాలు సెన్సేషన్ అని చెప్పాలి.

అప్పట్లో హోటల్స్ సామాన్య జనాల నుంచి అడ్డంగా దోచేస్తున్న సమయంలో ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

Telugu Doas, Hotels, Idli, Nandamuritaraka, Ntr, Senior Ntr, Sr Ntr, Tiffin, Tol

హోటల్స్ లో టిఫిన్ ఎంతకి అమ్మాలి అన్న దానిపై జీవో తీసుకువచ్చారు.ఈ జీవో పై సామాన్య ప్రజలు అందరూ ప్రశంసలు కురిపించారు.ఇడ్లీ 10 పైసలు,దోష పూరి 15 పైసలు, మసాలా దోశ 20 పైసలు, ప్లేట్ మీల్స్ అర్ధరూపాయి, ఫుల్ మీల్స్ రూపాయి ఇలా అన్ని రకాల ఆహారపదార్థాలకు రేట్ ఫిక్స్ చేస్తూ జీవో తీసుకువచ్చారు ముఖ్యమంత్రి ఎన్టీఆర్. అయితే ఇక ఈ జీవోపై హోటల్ యజమానులు మాత్రం గగ్గోలు పెట్టాయి.

జనం మాత్రం మా ఎన్టీవోడు మా కోసం ఎంత గొప్ప పని చేసాడు అంటూ ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు.ఇక ఆ తర్వాత హోటల్ యాజమాన్యాలు ఎన్టీఆర్ను వేడుకోవడం తో జీవో సవరణ చేసి ఉదయం ఆరింటి నుంచి 8 వరకు టిఫిన్లు నిర్ణయించిన రేట్ల కు అమ్మాలి తర్వాత మీ ఇష్టం అంటూ తేల్చి చెప్పారు.

అప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube