అడవి సింహాలు షూటింగ్ లో పెను ప్రమాదం.. ఓ వ్యక్తి తల తెగి గాల్లోకి ఎగిరింది..

అడవి సింహాలు. 1983లో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వనీదత్ నిర్మించిన సినిమా.

 Unknown Incident In Adavi Simhalu Shooting, Adavi Simhalu, Adavi Shimhalu Movie-TeluguStop.com

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.కృష్ణ‌, శ్రీ‌దేవి.

కృష్ణంరాజు, జ‌యప్ర‌ద ఈ సినిమాలో నటించారు.ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు హీరోలు కలిసి యాక్ట్ చేశారు.

ఈ సినిమాలోని పాటలన్నీ అప్పట్లో సంచలన విజయం సాధించాయి.ప్రియ‌త‌మా, హేయ్ హేయ్ గంట‌కొట్టిందా, అగ్గిపుల్ల భ‌గ్గుమంట‌ది, పిల్ల నచ్చింది, గూటిలోకి చేరేది ఎప్పుడు అంటూ సాగే ఈ సినిమా పాటలు జనాల నోళ్లలో నానిపోయాయి.

ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ ఘోర ప్రమాదం జరిగింది.ఇంతకీ ఈ ప్రమాదానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోజు అడవి సింహాలు సినిమా షూటింగ్ వైజాగ్ బీచ్‌ లో జరుగుతుంది.కృష్ణ‌, కృష్ణంరాజు, శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద‌పై పిల్ల న‌చ్చింది అనే పాటను షూట్ చేస్తున్నారు.ఆ పాట కోసం ఓ వ్యక్తి రంగు రంగుల బెలూన్లకు గ్యాస్ నింపుతున్నాడు.అప్పటి కొన్ని వందల బెలూన్లలో గ్యాస్ ఎక్కించాడు కూడా.

ఈ బెలూన్లను చూసేందుకు అక్కడ చాలా మంది పిల్లలు గుమిగూడారు.వాటితో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

Telugu Adavi Shimhalu, Adavi Simhalu, Cylinder, Raghavendra Rao, Jaya Prada, Kri

అదే సమయంలో అక్కడికి ఓ కారు వచ్చింది.అందులో హీరో హీరోయన్లుగా నటిస్తున్న కృష్ణంరాజు, జ‌య‌ప్ర‌ద వస్తున్నట్లు ఎవరో చెప్పారు.దీంతో అక్కడున్న పిల్లలు కారు వైపు పరిగెత్తారు.మరుక్షణంలోనే అక్కడ ఘోర ప్రమాదం జరిగింది.బెలూన్లలోకి గ్యాస్ ఎక్కిస్తుండగా సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది.బెలూన్లలోకి గ్యాస్ ఎక్కిస్తున్న వ్యక్తి తల తెగి గాల్లోకి లేచింది.అక్కడ ఏం జరుగుతుందో తెలియక జనాల అయోమయానికి గురయ్యారు.

Telugu Adavi Shimhalu, Adavi Simhalu, Cylinder, Raghavendra Rao, Jaya Prada, Kri

అక్కడి భయానక వాతావరణానికి అందరూ వణికిపోయారు.అప్పటి వరకు అక్కడే ఉన్న పిల్లలంతా దూరంగా వెళ్లడంతో ఘోర ప్రమాదం తగ్గిందని చెప్పుకోవచ్చు.లేదంటే ఊహించని రీతిలో ప్రమాదం జరిగేది.

చనిపోయిన వ్యక్తిని వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు.ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ఈ ప్రమాదాన్ని అనుకుండా జరిగిన ఘటనగానే పోలీసులు నమోదు చేసుకున్నారు.చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సినిమా నిర్మాత ఆర్థికసాయం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube