నటుడు నాజర్ క్లాస్ మేట్స్ అంత నటులే అని తెలుసా.. ?

దక్షిణాది సినిమా పరిశ్రమల్లో అద్భుత నటులు చాలా మంది ఉన్నారు.అయితే పాన్ ఇండియా నటులు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు.

 Unknown Friends Of Actor Nassar Details, Nassar, Actor Nassar, Actor Nassar Frie-TeluguStop.com

బాలీవుడ్ లో మాత్రం చాలా మంది ఉన్నారు.క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం పాన్ ఇండియా రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నవారు ఉన్నారు.

సౌత్ లో ఒకరిద్దరు మాత్రమే ఈ స్థాయి నటులున్నారు.వారిలో ఒకడు నాజర్.

ఏ పాత్ర ఇచ్చినా చక్కగా ఒదిగిపోతాడు నాజర్.విలన్ పాత్రల్లో అయితే ఇట్టే ఒదిగిపోతాడు.

విలన్ పాత్రలు మాత్రమే కాదు.తండ్రి, తాత ఏపాత్ర అయినా జనాల మదిలోకి వెళ్లేలా నటించగలుగుతాడు.

అన్ని పాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించగల నటుడు నాజర్.బాహుబలి సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు నాజర్.

అటు నాజర్ సినిమాల గురించే చాలా మందికి తెలుసు తప్ప.ఆయన వ్యక్తిగత విషయాలు చాలా మందికి తెలియదు.ఎవ్వరికీ తెలియని పలు విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.నాజర్ మంచి విద్యావంతుడు.

యుసి స్టడీస్ చేశాడు.మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బాటనీ డిగ్రీ పూర్తి చేశాడు.

డిగ్రీ రోజుల్లోనే ఆయనకు నటనపై మక్కువ పెరిగింది.నాటకాల్లోకి వెళ్లాడు.

రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆయన సినిమా రంగంలోకి ఈజీగానే వచ్చాడు.

అవకాశాలు ఆయననే వెతుక్కుంటూ వచ్చాయి.ఆ తర్వాత నటుడిగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడు.

Telugu Nassar, Nassar Friends, Bahubali, Chiranjeevi, Naasar, Nassarpan, Rajnika

నాజర్ కేవలం నటుడు మాత్రమే కాదు.చక్కటి రచయిత కూడా.ఆయన ఎన్నో పత్రికలకు కథలు, కవితలు రాసేవాడు.పలు వ్యాసాలు కూడా రాసేవాడు.నాజర్ నటనలో మాస్టర్ డిప్లమా చేసి గోల్డ్ మెడల్ కూడా సంపాదించాడు.ఆయన జాయిన్ అయిన యాక్టింగ్ స్కూల్లోనే రజనీకాంత్, విజయ్ కాంత్ లాంటి టాప్ హీరోలు సైతం జాయిన్ అయ్యారు.

అంతేకాదు.చిరంజీవి కూడా నాజర్ క్లాస్ మేట్.

అప్పటి నుంచే వీరి మధ్య స్నేహం ఉండేదట.మొత్తంగా పలువురు టాప్ హీరోలతో ఆయనకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube