రాయలసీమ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..?!

రాయలసీమ తెలుగు నేలపై ఈ పేరుకి ప్రత్యేకత ఉంది. ఫ్యాక్షన్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచింది.

 Rayalaseema Region ,kurnool, Kadapa, Annathapur, Chittor,1928 , Interesting Fac-TeluguStop.com

ఇక సరిగ్గా 90 ఏళ్ల క్రితం వరకూ ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు లేదు.అయితే అంత ముందు రాయలసీమకి ఏం పేరు ఉంది.

రాయలసీమకు ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దామా.ఇక ప్రస్తుత అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు, ప్రకాశం జిల్లాలోని కంభం, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలను, కర్నాటకలోని బళ్లారి, తుముకూరు, దావణగేరి ప్రాంతాలను దత్త మండలం అని పిలిచేవారు.

ఇక మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలనే ఉద్దేశంతో ఆంధ్ర మహాసభలు జరిగాయి.ఆంధ్ర మహాసభల్లో భాగంగా సీడెడ్ జిల్లాల సమావేశాలు 1928 నవంబర్ 17, 18 తేదీల్లో నంద్యాలలో జరిగాయి.

సీడెడ్ లేదా దత్త మండలం అన్న పదం బానిసత్వాన్ని సూచిస్తూ అవమానకరంగా ఉందన్న ఉద్దేశంతో దీన్ని మార్చాలన్న ప్రతిపాదనలు ఆ సమావేశాల్లో వచ్చాయి.

అయితే రాయలసీమ పేరు చరిత్రలో 16 శతాబ్దంలో వినిపించిన అంతకు ముందే రాయలసీమ పేరు మారుమోగిందని చెపుతోంది చరిత్ర.ఇక రాయలసీమ సరిహద్దు ప్రాంతాలు కూడా కాలంతో పాటు మారుతూ వచ్చాయి.1953 వరకూ మద్రాసు రాష్ట్రంలో, 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రంలో, 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాయలసీమ ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా మారింది.చరిత్రలో రాజదానులు మార్చుకుని ప్రజాస్వామ్యంలో సైతం రాజదాని ప్రాంతాల్లో మార్పుకు గురైన ఒకే ఒక్క ప్రాంతంగా రాయలసీమ చరిత్రలో నిలిచింది.

Telugu Andhra Pradesh, Annathapur, Rayalaseema, Kadapa, Kurnool-Latest News - Te

ఇక దేశానికి స్వాతంత్య్రం రాక ముందు ఉన్న రాయలసీమ విస్తీర్ణం భూభాగం, సరిహద్దులు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రాంతాల విభజనతో పూర్తికి కుచించుకుపోయింది.1953 వరకూ రాయలసీమలో ఉన్న బళ్లారి, తుముకూరు, దావణగేరే ప్రాంతాలు కర్నాటకలో కలిశాయి.1970లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు.ఆ క్రమంలో కర్నూలు జిల్లాలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు తాలూకాలను ప్రకాశం జిల్లాలో కలిపారు.

ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో కోస్తా-సీమ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది.

అయితే అక్కడితో విభజన ఆగిపోయినట్టు కనిపించడం లేదు.త్వరలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సీమ నాలుగు జిల్లాలను మరింత ముక్కలుగా చేసి 12 జిల్లాలకు పైగా విభజించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

అయితే జిల్లాల విభజనను స్వాగతిస్తున్న ఇక్కడ ప్రజలు తమ ఉనికిని కోల్పోయేలా విభజన ఉంటే మాత్రం వ్యతిరేకిస్తాం అని చెపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube