'త్రివిక్రమ్' గారి గురించి చాలామందికి తెలియని 12 ఆసక్తికర విషయాలు ఇవే..! 8 వ ది అయితే అసలు తెలిసి ఉండదు.!

సముద్రం, ఆకాశం, త్రివిక్రమ్ చూడటానికే…కొలవటానికి మనం సరిపోము.అమ్మ, ఆవకాయ్ ఎప్పటికీ మనకి ఎలాగైతే బాగుంటుందో.

 Unknown Facts Of Trivikram Srinivas Lifestyle-TeluguStop.com

అదే విధంగా త్రివిక్రమ్ గారి మాటలు కూడా మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.మాటల్లో పంచ్ మాత్రమే కాదు, లోతుగా వెతికి చూస్తే జీవిత విలువలు కూడా కనిపిస్తాయి.

ఆయన ఔన్నత్యం గురించి చెప్పడానికి మనకి వచ్చిన మాటలన్నీ కలిపినా కానీ సరిపోవు.ఇలా చెప్పడంలో అతిశయోక్తి ఏమి లేదు అని అభిమానుల అభిప్రాయం.

ఇంతకంటే ఎక్కువ చెప్పాలంటే నాకున్న శక్తి సరిపోదు, తెలిసిన పదాలు సరిపోవు.అందుకే “త్రివిక్రమ్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు” అని మాత్రమే చెప్తున్నాను.

ఆ ఒక్క మాట చాలు, మిగిలిన డైలాగ్స్ అన్ని మీరే ఊహించుకోగలరు.! త్రివిక్రమ్ గారి బెస్ట్ డైలాగ్స్ అని రాయడం కంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు అని ఓ ఫ్యాన్ గా నా అభిప్రాయం.

ఎందుకంటే సుందరకాండలో గొప్ప కావ్యం ఏది అని చెప్పడం అనేది పెద్ద పరీక్షే…ఎందుకంటే అందులో ప్రతి కావ్యం సుందరమే.! అలాగే త్రివిక్రమ్ గారి ప్రతి డైలాగ్ కూడా ఓ అద్భుతమే.! చందమామ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, మన మూడ్ ని బట్టి అది అందంగా కనిపిస్తుంది ఆయన చెప్పినట్టే…ఒకో మూడ్ లో ఉన్నప్పుడు ఆయన ఒక్కో డైలాగ్ మనకి కనెక్ట్ అవుతుంది.!

త్రివిక్రమ్ గారి గురించి చాలా మందికి తెలియని ఈ ఆసక్తికర విషయాలను ఓ సారి చూద్దాం.!

#1.త్రివిక్రమ్ పూర్తి పేరు “ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ”.భీమవరం ఆయన సొంత ఊరు.

#2.న్యూక్లియర్ ఫిజిక్స్ లో msc పూర్తి చేసి.ఆంధ్ర యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ అందుకున్నారు

#3.సిరివెన్నెల గారి మేనకోడలు అయిన “సౌజన్య” గారిని ఆయన పెళ్లి చేసుకున్నారు.వారికి ఇద్దరు సంతానం.

#4.dnr కాలేజీ లో చదువుతన్న రోజుల నుండి సునీల్, త్రివిక్రమ్ మంచి స్నేహితులు.సినిమా రంగంలో కష్టాలు పడుతున్న కొత్తలో ఇద్దరు రూమ్ మేట్స్!

#5.కెరీర్ మొదట్లో “పోసాని” గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేసారు త్రివిక్రమ్.కమెడియన్ గౌతమ్ రాజు గారి పిల్లలకి ట్యూషన్ కూడా చెప్పారు!

#6.ఆయన ఫస్ట్ స్క్రిప్ట్ రాసిన సినిమా “నిన్నే ప్రేమిస్తా.” డైలాగ్స్ రాసింది “స్వయంవరం”.కానీ స్వయంవరం కంటే ముందే “నువ్వే కావాలి” విడుదల అయ్యింది.

#7.బెస్ట్ డైలాగ్ రైటర్ గా అయిదు సార్లు నంది అవార్డు అందుకున్నారు త్రివిక్రమ్.అతడు, అత్తారింటికి దారేది సినిమాలకు ఫిలిం ఫేర్ అవార్డ్స్ కూడా అందుకున్నారు.

#8.ఒక రాజు ఒక రాణి, తీన్మార్ సినిమాల్లో పాటలు కూడా రాసారు త్రివిక్రమ్.అంతేకాదు “నువ్వే నువ్వే” లో “కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్” పాటలో ఓ బిట్ కూడా పాడారు.

#9.రామ్ చరణ్, ధోని తో పెప్సీ యాడ్స్, ఎన్టీఆర్ నవరత్న యాడ్, మహేష్ బాబు జొస్ అలుకాస్ యాడ్, తమన్నా, కోహ్లీ సెల్కొన్ యాడ్స్ కూడా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసారు.

#10.ఆరు సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసి టాప్ 3 డైరెక్టర్స్ లిస్ట్ లో త్రివిక్రమ్ స్థానం సంపాదించుకున్నారు

#11.అతడు సినిమా తెలుగు, హిందీ, మలయాళం లోనే కాదు పోలిష్ భాషలో కూడా డబ్ అయ్యింది.

#12.జల్సా ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ 40 లక్షలకు కొనుగోలు చేసింది.ఇదే ఇప్పటివరకు హైయెస్ట్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube