పిచ్చోడి కథ సాగర సంగమం.. సౌత్ ఇండియాలో సంచలన విజయం సాధించింది..

తెలుగు సినిమా ప్రపంచంలో ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయిన సినిమా సాగర సంగమం.కమల్ హాసన్ నటించిన ఈ సినిమా ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.అయితే ఈ సినిమాలోని క్యారెక్టర్.నిజ జీవితంలో కనిపించిన ఓ పాత్ర నుంచి రూపొందించాడు దర్శకుడు కె.విశ్వనాథ్.అత్యంత గొప్ప సినిమా ఓ పిచ్చి వాడి నుంచి ప్రాణం పోసుకుంది.

 Unknown Facts Of Sagara Sangamam Details, Sagara Sangamam, Kamal Haasan, Directo-TeluguStop.com

ఇంతకీ ఆ పిచ్చివాడు ఎవడు? ఆయనకు సాగర సంగమం కథకు సంబంధం ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

విశ్వనాథ్ చిన్న తనంలోకి వెళ్తే.

ఆయన ఊరిలో ఓ పిచ్చివాడు ఉండేవాడు.మాసిపోయిన షర్ట్.చినిగిపోయిన ప్యాంట్.చింపిరి జుట్టుతో ఊళ్లో తిరిగేవాడు.నిత్యం ఊరిలో కనిపించేవాడు.సాగర సంగమం సినిమా కథ రాయాలి అనుకున్న సందర్భంలో ఎందుకో విశ్వనాథ్ మదిలోకి మళ్లీ మళ్లీ వచ్చేవాడు ఆ పిచ్చివాడు.

కొద్ది రోజుల పాటు తన గురించే బాగా ఆలోచించాడు.అతడు ఎప్పుడూ రోడ్డు పక్కనే ఉండేవాడు.

ఎవరినీ చేయిచాపి ఏమీ అడిగేవాడు కాదు.తనకు తెలిసిన షాపుల దగ్గరికి వెళ్లి నిల్చునేవాడు.

వారు తనకు తినడానికి ఏదో ఒకటి ఇచ్చేవారు.

Telugu Vishwanath, Sagara Sangamam, Kamal Haasan, Sagarasangamam-Movie

ఇదే పాత్రను తన సినిమాలో హైలెట్ చేయాలి అనుకున్నాడు విశ్వనాథ్.లోకం గురించి తెలియపోయినా.సమాజనం తనను హేళన చేస్తున్నా.

వేటినీ పట్టించుకోకుండా.తన ప్రపంచంలో తాను జీవించేవాడు.

ఆ పిచ్చివాడే తన సినిమా హీరో అని ఫిక్సయ్యాడు దర్శకుడు.అతడిని ఊహించుకుని సాగర సంగమం సినిమా కథ రాశాడు.

జీవితాన్ని కోల్పోయిన ఓ అసమర్థుడిని తన సినిమాలో మెయిన్ పాత్ర చేసిన అద్భుతంగా ఆవిష్కరించాడు.కళా తపస్వి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం కలిగించింది.

మొత్తం సౌతిండియాలోని అన్ని భాషల్లో ఈ సినిమా విడుదల అయ్యింది.ఈ సినిమా విడుదల అయిన అన్ని భాషల్లో 100 రోజులు ఆడి సంచలనం కలిగించింది సాగర సంగమం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube