'పదెనెట్టాంపడి'పద్దెనిమిది మెట్లు ఏ మహిళైనా దాటితే..శబరిమలకు అవి రావు... పద్దెనిమిది మెట్లకి అర్దం ఏంటో తెలుసా..వాటి విశిష్టత ఏంటో తెలుసుకోండి...  

Unknown Facts Of Sabarimala 18 Steps -

బరిమలలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.కొందరు ఈ తీర్పును స్వాగతిస్తుండగా.

Unknown Facts Of Sabarimala 18 Steps - -Telugu Bhakthi-Telugu Tollywood Photo Image

మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.శబరిమలలోని 18 మెట్లను ఒక్క మహిళ దాటినా పందళ అంతఃపురం నుంచి అయ్యప్ప ఆభరణాలతో కూడిన పెట్టె శబరిమలకు రాదని, అయ్యప్ప ఆలయం ప్రభుత్వానికి సంబంధించినదైనప్పటికీ.

అయ్యప్పకు సొంతమైన ఆభరణాలు పందళ కుటుంబానికి చెందినవని రాజ కుటుంబం ప్రకటించింది.అంతేకాదు పందళ రాజ కుటుంబానికి చెందిన ఎవ్వరూ.

‘పదెనెట్టాంపడి’పద్దెనిమిది మెట్లు ఏ మహిళైనా దాటితే..శబరిమలకు అవి రావు… పద్దెనిమిది మెట్లకి అర్దం ఏంటో తెలుసా..వాటి విశిష్టత ఏంటో తెలుసుకోండి… -Unknown Facts Of Sabarimala 18 Steps - -Telugu Bhakthi-Telugu Tollywood Photo Image

ఆలయానికి రాబోరని స్పష్టం చేసింది.మరోవైపు మహిళలు గుడిలోకి ప్రవేశిస్తే శబరిమల అర్చకులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ప్రకటించారు.

అయ్యప్ప మాలను ధరించిన వారందరూ శబరిమలను సందర్శించి అక్కడ మాలను తీసేసి ఆ క్షేత్రంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారన్నది తెలిసిన విషయమే.స్వాములతో పాటు భక్తులు ఆలయాన్ని సందర్శించినప్పటికి ఆలయంలో ఉన్న 18 మెట్లపై నుంచి కేవలం అయ్యప్పమాలను ధరించిన స్వాములకు మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది…ఇంతకీ ఆ 18 మెట్ల గురించి విషయాలు మీకు తెలుసా.? ఆ మెట్లలో ఒక్కో మెట్టు ఒక్కో విషయాన్ని తెలియజేస్తుంది.ఆ మెట్ల గురించిన పూర్తి విషయాలను తెలుసుకుందామా.

కామం – 1వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “గీతా మాత”.ఈ మెట్టు ఎక్కడం ద్వారా మనిషికి పూర్వజన్మస్మృతి కలుగుతుంది.గతజన్మలో తాను చేసిన పాపపుణ్యకర్మల విచక్షణాజ్ఞానం కలిగి మనిషి మానసికంగా శుద్ది పొందుతాడు.

క్రోధం – 2వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “గంగా దేవి”.

ఈ మెట్టును స్పరించడం వలన మనిషికి తాను దేహాన్ని కాదు పరిశుద్ధాత్మను అనే జ్ఞానం కలుగుతుంది.“తన కోపమే తన శత్రువు”.మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు.

లోభం – 3వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “గాయత్రీ మాత”.

ఈ మెట్టును స్పరించడం వలన మనిషికి పిశాచత్వం నశించి ఉత్తమగతులు కలుగుతాయి.అవసరాలకంటే ఎక్కువ కావలనుకునే బుద్ది.

కీర్తి కోసం అత్యాశ, తీవ్రమైన మరియు స్వార్థపూరిత కోరిక.దురాశ దుఖాఃనికి చేటు.

మోహం – 4వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “సీతా దేవి”.ఈ మెట్టు జ్ఞానయోగానికి ప్రతీక.ఒక పరిస్థితిని లేక నమ్మకమైన ఒక కారణం, ప్రత్యేకించి ఒక వ్యక్తి పై ప్రేమ /అనుబంధం భావనకు ఈ మెట్టును గుర్తుగా విశ్వసిస్తారు.

మదం – 5వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “సత్యవతీ మాత”.ఈ మెట్టు కర్మసన్యాసయోగానికి ప్రతీక.4 & 5 మెట్లు స్పర్శించిన గృహములో ఉన్న పశు-పక్ష్యాదులకు సైతం పాపాలు నశించి, ఉత్తమగతులు కలుగుతాయి.

మాత్స్యర్యం – 6వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “సరస్వాతీ దేవి”.ఈ మెట్టు స్పర్శల వలన విష్ణుసాయుజ్యం, సమస్త ధాన ఫలం కలుగుతుంది.ఇతరుల సంతోషాన్ని కానీ ఆనందాన్ని కానీ ఓర్వలేని బుద్ధి ఇది.

దంబం – 7వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “బ్రహ్మవిద్యా దేవి”.ఈ మెట్టు స్పర్శల వలన విజ్ఞానయోగాధ్యాయం కలిగి పునర్జన్మ కలగదు.

అహంకారం – 8వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “బ్రహ్మవల్లీ దేవి”.

ఈ మెట్టు స్పర్శ వలన స్వార్ధం, రాక్షసత్వం నశిస్తాయి.

నేత్రములు – 9వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “త్రిసంధ్యా దేవి”.

ఈ మెట్టు స్పర్శ వలన అప్పుగాతీసుకున్న వస్తువుల వల్ల సంక్రమించిన పాపం హరిస్తుంది.

చెవులు – 10వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “ముక్తిగేహినే దేవి”.

ఈ మెట్టు స్పర్శ వలన ఆశ్రమధర్మ పుణ్యఫలం, జ్ఞానం కలుగుతుంది.

నాసిక – 11వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “అర్ధమాత్రా దేవి”.

ఈ మెట్టు స్పర్శ వలన అకాలమృత్యుభయం ఉండదు.

జిహ్వ – 12వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “చిదానందా దేవి”.

ఈ మెట్టు స్పర్శ వలన ఇష్టదేవతా దర్శనము లభిస్తుంది.దీనిని కఠోరంగా మాట్లాడడానికి ఉపయోగించకూడదు.

స్పర్శ – 13వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “భవఘ్నీ దేవి”.ఈ మెట్టు స్పర్శ వలన వ్యభిచార, మద్య, మాంసభక్షణ, పాపాలు నశిస్తాయి.

స్వామి పాదములను స్పర్శించుటకు ఉపయోగపడే ఇంద్రియమే స్పర్శ.

సత్వం – 14వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “భయనాశినీ దేవి”.

ఈ మెట్టు స్పర్శ వలన స్త్రీహత్యాపాతకాలు నశిస్తాయి.

తామసం – 15వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “వేదత్రయూ దేవి”.

ఈ మెట్టు స్పర్శ వలన ఆహారశుద్ధి, మోక్షం,కలుగుతాయి.

రాజసం – 16వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “పరాదేవి”.

ఈ మెట్టు స్పర్శ వలన దేహసుఖం, బలం లభిస్తాయి.

విద్య – 17వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “అనంతాదేవి”.

ఈ మెట్టు స్పర్శ వలన దీర్ఘవ్యాధులు సైతం నశిస్తాయి.

అవిద్య – 18వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత “జ్ఞానమంజరీదేవి”.

ఈ మెట్టు స్పర్శ వలన యజ్ఞాలు చేసిన పుణ్యఫలం, ఆర్ధిక స్థిరత్వం కలుగుతాయి.

.

TELUGU BHAKTHI