ఛార్మినార్ కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా..నాలుగు మినార్ల వలన మాత్రమే కాదు..మరీ..

ఛార్మినార్ హైదరాబాద్ లో ఉన్న ప్రాచీన కట్టడాల్లో ఒకటన్న విషయం తెలిసిందే.క్రీస్తుశకం 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా ఈ కట్టడాన్ని మహ్మద్ ఖులీ ఖుతుబ్ షా నిర్మించాడు.

 Unknown Facts Of Hyderabad Charminar-TeluguStop.com

హైదరాబాద్ పేరు వినగానే టక్కున గుర్తొచ్చే వాటిల్లో ఛార్మినార్ ఒకటి…అంతేకాదు ఛార్మినార్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ అని చిన్నపిల్లలు కూడా ముక్తకంఠంతో చెప్పేస్తారు.అయితే ఛార్మినార్ కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే మాత్రం నాలుగు మినార్లు ఉన్నాయి కాబట్టి అని సమాధానం వస్తుంది కొందరినుండి.

కానీ కేవలం నాలుగు మినార్లు ఉన్నాయి కాబట్టి చార్మినార్ కు ఆ పేరు పెట్టలేదు.నాలుగుకు, ఛార్మినార్ కు విడదీయరాని బంధం ఉంది కాబట్టే దానికి ఆ పేరు వచ్చింది.ఇంతకీ నాలుగుకి ,ఛార్మినార్ కు ఉన్న అవినాభవ సంబంధం వివరాలు మీకోసం…

చార్మినార్ నిర్మాణంలో నాలుగు మినార్లలోనే కాదు అడుగడుగునా నాలుగు దాగి ఉంది.ఈ కట్టడం ప్రతి కోణంలోనూ నాలుగు ఉంది.ఇలా నాలుగు ప్రతి బింబించేలా చార్మినార్ ను నిర్మించడం అప్పటి నిర్మాణ, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యం.పురావస్తుశాఖ అధికారుల పరిశోధనలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టడానికి గల కారణాలు వెలికివచ్చాయి.

ఛార్మినార్ కు ఆ పేరుపెట్టడానికి మొత్తం 20 కారణాలు ఉన్నట్లు భారత పురావస్తుశాఖ అధికారులు తమ పరిశోధనలతో ఓ నిర్ణయానికి వచ్చారు.

· అందులో ముఖ్యమైనవి చార్మినార్ కు నాలుగు వైపులా 40 ముఖాలు ఉంటాయి.

వీటిని నాలుగుతో భాగిస్తే శేషం సున్నావస్తుంది.

· నాలుగు మినార్ల ఎత్తు 60 గజాలు.

వీటిని నాలుగుతో భాగిస్తే శేషం సున్నా వస్తుంది.

· చార్మినార్ నాలుగు రోడ్ల కూడలిలో ఉంటుంది.

భారత దేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రాత్మక కట్టడాల్లో చార్మినార్ మొదటివరుసలో నిలబడుతుంది.ఛార్మినార్ నిర్మాణానికి పట్టిన స్థల విస్తీర్ణం.840 చదరపు గజాలు…ఈ సంఖ్య కూడా నాలుగుతో భాగిస్తే శేషం సున్నా వస్తుంది.

· ఛార్మినార్ లోని ప్రతి మినార్లలో నాలుగు గదులు ఉన్నాయి.మొదటి రెండు గ్యాలరీల్లో 20 ఆర్చరీలు ఉన్నాయి.3,4 గ్యాలరీల్లో ఒక్కొక్క ఆర్చరీలో 12 చొప్పున మొత్తం 24 ఆర్చరీలు ఉన్నాయి.అంటే మొత్తం ఆర్చరీల సంఖ్య 44.దీనిని కూడా నాలుగుతో భాగిస్తే శేషం సున్నానే.

· ఛార్మినార్ లోని ప్రతి కొలతలో కూడా నాలుగు కనిపిస్తుంది.రెండో అంతస్తుకు నాలుగో ఆర్చ్ కు నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి.

· ప్రతి మినార్ లోని బాల్కనీలో శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలు ఉన్నాయి.ఈ చార్మినార్ కట్టడానికి గల విశాలమైన ఆర్చ్ లకు ఇరువైపాలా నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి.ఇటువంటి మొత్తం స్థలాలు 32.ఈ సంఖ్యలన్నీ నాలుగుతో భాగింపబడుతాయి.

· మొదటి అంతస్తులోని ఆర్చ్కు, మినార్లకి మధ్య చతురస్రాకారంలో 16 గజాల చుట్టు కొలతతో ఒక నీటి కొలను ఉంది.ఒక్కొక్క మినార్ కు మధ్య ఖాళీ స్థలం 28 గజాలు.

చార్మినార్ కి నాలుగు వైపులా 48 చదరపు గజాల స్థలాన్ని కేవలం ఆర్చ్ ల కోసం వదిలివేశారు.

· కట్టడం పైకి వెళ్లడానికి ప్రతి మినార్ లో 140 మెట్లు ఉన్నాయి.

ఈ సంఖ్యలన్నింటినీ నాలుగు భాగిస్తే శేసం సున్నా వస్తుంది.

· చార్మినార్ లోని మూడో అంతస్తులో చిన్న మసీదు ఉంది.

ఇక్కడ నమాజు కూడా చేసుకోవచ్చు.ఈ మసీదుకు కూడా నాలుగు మినార్లు ఉన్నాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube