విజయశాంతి కోసం బాలకృష్ణ అంత పెద్ద త్యాగం చేశాడా.. ?

బాల‌కృష్ణ‌.విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ నట వారసుడు.

 Unknown Facts About Vijayshanthi Rowdy Inspector Movie, Vijay Shanthi Rowdy Inspector Movie, Vijayshanthi, Balakrishna, Vijayashanti Fight Scenes-TeluguStop.com

ఎన్టీఆర్ కుమారుడిగా సినిమా రంగప్రవేశం చేసినా.సొంత ఇమేజ్ తో అగ్ర హీరోగా ఎదిగాడు బాలయ్య.

ఎన్టీఆర్ కు సమాన స్థాయిలో నటించగల సత్తా ఉన్న వ్యక్తి బాలయ్య.తను ఏపాత్ర చేసినా.

 Unknown Facts About Vijayshanthi Rowdy Inspector Movie, Vijay Shanthi Rowdy Inspector Movie, Vijayshanthi, Balakrishna, Vijayashanti Fight Scenes-విజయశాంతి కోసం బాలకృష్ణ అంత పెద్ద త్యాగం చేశాడా.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తిరుగు ఉండేది కాదు.ఆయన స్థాయిలో పలు రకాల సినిమాలు చేశాడు ఈ నటసింహం.

పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాలు చేస్తూ అందరి ప్రశంసలు పొందాడు.టాలీవుడ్ లో అగ్రనటుడిగా ఎదిగాడు.

ఇప్పటికీ తండ్రి సత్తాను చాటేలా నటిస్తూ.టాప్ హీరోగానే కొనసాగుతున్నాడు.

బాలయ్య నుంచి మిగతా సినీ జనాలు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.సినిమాలు సూపర్ హిట్ అయితే చాలు వెంటనే తమ రెమ్యునరేషన్ భారీగా పెంచుతారు.బాలయ్య మాత్రం అలాంటి విషయాలకు దూరం.ఆయన డబ్బు కోసమే సినిమాలు చేయడు అనేది సినిమా పరిశ్రమ టాక్.అంతేకాదు.సినిమాలో తనకు కాకుండా ఇతర పాత్రకు మంచి పేరు వస్తుందని భావిస్తే.

చాలా హీరోలు ఆయా పాత్రలను కట్ చేయాలని చెప్తారు.తమకు మాత్రమే పేరు రావాలని భావిస్తారు.

కానీ ఇలాంటి విషయాలకు తాను దూరం అంటాడు బాల‌కృష్ణ‌.

తనకు పేరు రాకపోయినా ఫర్వాలేదు.మిగతా నటులకు మంచి పేరు రావాలని భావించేవాడు బాలయ్య. రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్ అనే సినిమాలో బాలయ్య హీరోగా నటించాడు.

ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్ గా చేసింది.అయితే ఈ సినిమా ఎడిటింగ్ సమయంలో ఒక ఫైట్ తీసేయాల్సి వచ్చింది.

విజయశాంతి ఫైట్ తీసేస్తానని దర్శకుడు గోపాల్ విషయం బాలయ్యకు చెప్పాడు.

అందుకు బాలయ్య ఒప్పుకోలేదు.అమ్మాయి కష్టపడి చేసిన ఫైట్ ను తీసేయడం సమంజసం కాదని చెప్పాడు.కావాలంటే తన ఫైట్ ఒకటి తీసేయాలన్నాడు.

బాలయ్య ఉదార స్వభావం పట్ల గోపాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.అనుకున్నట్లుగానే సినిమాలో విజయశాంతి ఫైట్ ఉంచారు.

సినిమా రిలీజై మంచి విజయం సాధించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube