దర్శకురాలిగా తొలి సినిమా విషయంలో విజయ నిర్మల ఎందుకు మనసు మార్చుకుంది?

విజ‌య‌ నిర్మ‌లమనందరికీ సూపర్ స్టార్ క్రిష్ణ భార్యగానే తెలుసు కానీ ఆమెను సినిమా రంగంలో ఆల్ రౌండర్ గా చెప్పుకోవచ్చు.ఆమె హీరోయిన్ గానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా కూడా వ్యవహరించి మంచి సక్సెస్ అందుకున్నారు.

 Unknown Facts About Vijaya Nirmala Direction , Tollywood ,  Heroine , Directorr-TeluguStop.com

తొలినాళ్లలో హీరోయిన్ గా కొనసాగిన ఆమె .మీనా సినిమాతో దర్శకురాలిగా మారింది.విజయ నిర్మల మూడో సినిమా సాక్షి.ఈ సినిమాకు బాపు దర్శకత్వం వహించారు.దర్శకత్వంలో ఆయన తీససుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, స్టోరీ బోర్డు విధానం విజయ నిర్మలకు బాగా నచ్చింది.ఎలాగైనా దర్శకురాలిగా మారాలి అనుకుంది.అయితే దర్శకత్వంలో మెళకువలు బాగా నేర్చుకుంది.10 ఏండ్ల పాటు సినిమాల్లో నటిస్తూనే దర్శకత్వం గురించి స్టడీ చేశారు.నటిగా నిలదొక్కుకున్నాక దర్శకత్వ బాధ్యతలు తీససుకున్నారు.

క‌విత అనే మ‌ల‌యాళ చిత్రంతో దర్శకురాలిగా మారారు.

ఈ సినిమా ఘన విజయం సాధించింది.దర్శకురాలిగా విజయ నిర్మలకు మంచి పేరు తెచ్చింది.

ఆ తర్వాత తెలుగులో య‌ద్ద‌న‌పూడి సులోచ‌నారాణి న‌వ‌ల మీనాను అదే పేరుతో తెలుగులో తీశారు.ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు టైటిల్ రోల్ ఈమే చేశారు.

ఈ సినిమా ఘన విజయం సాధించమే కాకుండా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ లో చోటు దక్కించుకుంది.

నిజానికి మీనాతో కాకుండా ఓ క్రైమ్ స్టోరీతో విజ‌య‌ నిర్మ‌లను తెలుగులో దర్శకురాలిగా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నాడు క్రిష్ణ.

అదే విషయాన్ని ఆరుద్రకు చెప్పాడు సూపర్ స్టార్.

Telugu Vijaya Nirmala, Arudra, Directorr, Krishna, Tollywood-Telugu Stop Exclusi

తన కోరిక మేరకకు ఓ సీక్రెట్ ఏజెంట్ స్టోరీ రాశాడు ఆరుద్ర.ఆ స్టోరీ అందరికీ నచ్చింది.డైలాగ్స్ కూడా రాయాలని చెప్పాడు.

అయితే ఈ సినిమాతో విజయ నిర్మల దర్శకురాలలిగా పరిచయం అయితే ఆమెపై ఇదేముద్ర పడుతుందని హెచ్చరించాడు.ఒక ఫ్యామిలీ సినిమా దర్శకురాలిగా వస్తే బాగుంటుందని చెప్పాడు.

Telugu Vijaya Nirmala, Arudra, Directorr, Krishna, Tollywood-Telugu Stop Exclusi

ఆయన సూచన మేరకు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.ఆరోజుల్లో ప్రముఖ పత్రికలో సీరియల్ గా వస్తున్నన యద్ధనపూడి సులోచనా రాణి మీనా బాగా ఫేమస్ అయ్యింది.ఆ కథను సినిమాగా చేయాలనుకున్నారు.కవిత తర్వాత తెలుగులో మీనాతో దర్శకురాలిగా వచ్చింది విజయ నిర్మల.ఈ సినిమా ఘన విజయం సాధించడంతో మంచి పేరు పొందింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube