వీరభద్రుడు, భద్రకాళి జననం వెనుక రహస్యం తెలుసా..?

ఆ పరమ శివుడికి సంబంధించిన కథలలో దక్షయజ్ఞానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరభద్రుడి జననం గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఈ దక్షయజ్ఞం గురించి తెలుసుకోవాల్సిందే.

 Unknown Facts About Veera Bhadrudu-TeluguStop.com

మొదటి నుంచి ఆ పరమ శివుడు అంటే దక్ష కుడికి అసలు ఇష్టం ఉండేది కాదు.ఎప్పుడు స్మశానంలో ఉండి బూడిద రాసుకుంటూ తపస్సు చేసుకునే వాడిగా శివుని భావించటం వల్ల మొదటి నుంచి కూడా దర్శకుడికి శివుడంటే గిట్టేది కాదు.

కానీ ఆయన కూతురు సతీదేవి మాత్రం శివునిపై మనసుపడి ఎలాగైనా అతనిని వివాహం చేసుకోవాలని భావించింది.ఈ విషయంలో తండ్రి మాటను కాదని సతీదేవి ఆ శివుని పెళ్లి చేసుకుంది.

 Unknown Facts About Veera Bhadrudu-వీరభద్రుడు, భద్రకాళి జననం వెనుక రహస్యం తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శివుని తన అల్లుడుగా చేసుకున్న తక్షకుడు ఎలాగైనా తనను అవమానించాలని పణంగా పెట్టుకున్నాడు.ఈ నేపథ్యంలోనే దక్షయజ్ఞం చేయాలని భావించి ఈ యజ్ఞానికి సమస్త లోకాలలో ఉన్న దేవతలు, ఋషులు, రాక్షసులకు ఆహ్వానం పంపిస్తాడు.

కానీ తన అల్లుడైన శివుని పిలిచడు.తన తండ్రి యజ్ఞం చేస్తున్న సంగతి తెలుసుకున్న సతీదేవి ఎలాగైనా యజ్ఞానికి వెళ్లాలని శివునితో పట్టుబడుతుంది.పిలవని పూజా కార్యక్రమానికి వెళ్లడం సబబు కాదని ఆ పరమశివుడు ఎంత చెప్పినా వినకుండా మొండిపట్టు పడడంతో శివుడు తన ప్రమథ గణాలను తోడుగా పంపి సతీదేవిని యజ్ఞానికి పంపిస్తాడు.

యజ్ఞానికి వచ్చిన సతీదేవిని గమనించిన దక్షకుడు ఎన్నో మాటలతో ఎంతో అవమానకరంగా మాట్లాడటం పట్ల సహించని సతీదేవి అదే యజ్ఞగుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.తన సతీదేవి ఆత్మహత్య గురించి తెలుసుకున్న పరమశివుడు ఎంతో ఆగ్రహానికి గురై తన కేశాలను పెరికి నేలకు వేసి కొట్టగా అప్పుడు ఉద్భవించిన రూపమే వీరభద్రుని రూపం.ఆకాశమంత ఎత్తున, కారుమేఘపు చాయతో, పదులకొద్దీ ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రడు.

అంతేకాకుండా వీరభద్రునికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రకాళి.ఈ విధంగా వీరిద్దరూ జన్మించి ప్రమధ గణాలతో కలిసి ఆ దక్ష యజ్ఞాన్ని పాడు చేయడమే కాకుండా దక్షకుని సంహరిస్తారు.

ఈ విధంగా వీరభద్రుడు, భద్రకాళి జన్మించారని పురాణాలు చెబుతున్నాయి.

#Lard Shiva #Veera Badrudu #Badrakali #Dakshakudu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL