పంజాగుట్ట సెంటర్ లో అనుష్క హోర్డింగ్ చూసి 40 యాక్సిడెంట్లు ..ఆ సినిమా ఏంటి.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా మంది దర్శకులు సినిమాలను తీసి మంచి గుర్తింపును సాధించుకున్నారు.అలాంటి వారిలో ఒకప్పుడు దాసరి నారాయణరావు కె.

 Unknown Facts About Vedam Movie-TeluguStop.com

రాఘవేంద్రరావు లాంటివారు దర్శకులుగా వాళ్ళ ప్రతిభను చూపించి ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించారు.వాళ్ల తదనంతరం చాలామంది దర్శకులు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ అందులో రాజమౌళి, వివి వినాయక్, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు మాత్రమే అగ్ర దర్శకులు గా గుర్తింపు సాధించుకున్నారు.

అయితే ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నప్పటికీ వైవిధ్యమైన కథలతో మనం రోజు చూసే సామాన్యమైన మనుషుల మీద సినిమాలు చేసే దర్శకుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన ఎవరంటే క్రిష్.

 Unknown Facts About Vedam Movie-పంజాగుట్ట సెంటర్ లో అనుష్క హోర్డింగ్ చూసి 40 యాక్సిడెంట్లు ..ఆ సినిమా ఏంటి.-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈయన శర్వానంద్ హీరోగా వచ్చిన గమ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఆ సినిమాలో ఆయన దర్శకత్వ ప్రతిభకు మంచి గుర్తింపు లభించింది.ముఖ్యంగా అల్లరి నరేష్ అందులో పోషించిన గాలి శీను క్యారెక్టర్ కి చాలా అవార్డులు కూడా వచ్చాయి అప్పటివరకు అల్లరి నరేష్ అంటే కామెడీ మాత్రమే చేస్తాడు అని అనుకున్నా జనాలు కామెడీ తో పాటు నరేష్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేస్తాడు అని నిరూపించిన సినిమా చివర్లో నరేష్ చనిపోయినప్పుడు ప్రతి ఒక్క ఆడియన్ కంట్లో నుంచి కన్నీరు కార్చుకుంటూ ఉంటాడు.అయితే ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించిన తర్వాత తన తదుపరి చిత్రంగా క్రిష్ ఒక పెద్ద సినిమా చేద్దామని ఆలోచన ఉండి ఒక ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు.

కానీ అనుకోకుండా క్రిష్ ఒక రోజు ఒక కాలేజీ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాడు అక్కడ స్టూడెంట్స్ చూపించిన ప్రతిభకు ఇంప్రెస్ అయ్యాడు.అయితే కాలేజీలో ఫంక్షన్ ముగిసిన తర్వాత పక్కనే ఉన్న ఒక టెంపుల్ కి వెళ్ళాడు అక్కడ ఆ టెంపుల్ కి వచ్చిన ఒక అమ్మాయి మీరు గమ్యం సినిమా డైరెక్టర్ కదా అని అడిగారు దాంతో ఆయన అవును అని సమాధానం చెప్పి, నీకు ఆ సినిమాలో ఏం నచ్చింది అని అడిగితే ఒక ప్రేమించిన అమ్మాయి కోసం ఒక పెద్దింటి అబ్బాయి వెతుక్కుంటూ రావడం అనేది చాలా బాగా నచ్చింది అని చెప్పడంతో క్రిష్ చాలా సంతోషపడ్డాడు.

అయితే అక్కడి నుంచి ఇంకొక టెంపుల్ కి వెళితే అక్కడ ఒక అబ్బాయి ఒక ముసలాయన చేయిపట్టుకుని నడుచుకుంటూ తీసుకెళ్లే ఒక సీన్ కనిపించింది అయితే కృషి అక్కడే వేదం సినిమాకు సంబంధించిన బీజం పడింది.దాన్ని మైండ్లో పెట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్షన్ టీంతో కలిసి మనం ఒక సినిమా చేస్తున్నాం ఒక పిల్లాడు వెట్టి చాకిరి చేస్తుంటే వాళ్ల అమ్మ కిడ్నీ అమ్మి ఆ పిల్లాడిని అక్కడి నుంచి విడిపిస్తుంది అనేది కాన్సెప్ట్ అని దాంతో వాళ్ల టీం తో కలిసి మెల్లిగా అలా డెవలప్ చేసుకుంటూ వేదం సినిమా స్క్రిప్ట్ రాసుకున్నాడు క్రిష్.అయితే ఒకరోజు అల్లు అర్జున్ ఫోన్ చేసి ఏదైనా కథ ఉంటే చెప్పు మనం సినిమా చేద్దాం అని అనడంతో క్రిష్ చేయబోయే వేదం కథ గురించి చెప్పి దాంట్లో ఒక క్యారెక్టర్ కేబుల్ రాజు ఉందని ఆ క్యారెక్టర్ గురించి అల్లుఅర్జున్ కి చెప్పడంతో తనకి ఆ క్యారెక్టర్ నచ్చి సినిమా చేశాడు.

దాంతో మిగిలిన క్యారెక్టర్ల కి అనుష్క ని, మంచు మనోజ్ నీ అడగడంతో వాళ్లు కూడా కథ నచ్చి సినిమా చేస్తాం అని ఒప్పుకొన్నారు దాంతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది తొందరగానే పూర్తి కూడా చేశారు, ఆ తర్వాత సినిమాని రిలీజ్ చేశారు ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క హోర్డింగ్ ని పంజాగుట్ట లో పెడితే 40 కి పైగా వాహనాలు ప్రమాదాల భారిన పడ్డాయని పోలీసు వారు ఆ హోర్డింగ్ ని తీసెయ్యడం గమనించాల్సిన విషయం.ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కి అలాగే అనుష్క కి డైరెక్టర్ క్రిష్ కి కూడా అవార్డులు వచ్చాయి.

ఈ సినిమా కి నంది అవార్డు కూడా వచ్చింది.అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది వేదం అనే చెప్పాలి.

అల్లు అర్జున్ క్లైమాక్స్ లో డబ్బులు దొంగలించి మళ్లీ ఆ డబ్బులని వాళ్లకు ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు ఆయన నటించిన తీరు చాలా అద్భుతంగా ఉందని అప్పుడు అతన్ని సీనియర్ యాక్టర్లు అందరూ ప్రశంసించారు.

#Anushka Shetty #UnknownFacts #Vedam Posters #Director Krish #AnushkaHoarding

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు