విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!

పురాణాల ప్రకారం భక్త సంరాక్షణార్ధం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తిన సంగతి మనకు తెలిసిందే.మహావిష్ణువు భక్తి సంరక్షణార్థం దశ అవతారాలు ఎత్తాడు.

 Unknown Facts About Varahavataram-TeluguStop.com

అందులో మూడవ అవతారము వరాహావతారము.విష్ణుమూర్తి వరాహవతారాన్ని ఎత్తడానికి గల కారణాలు ఏమిటి? ఎవరి కోసం ఆ విధంగా వరాహవతారం ఎత్తాల్సి వచ్చింది అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం

ఒకరోజు సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు దర్శనం కోసం సనక సనందాది మహా ఋషులు వైకుంఠానికి చేరుకుంటారు.వైకుంట ద్వార పాలకులైన జయ, విజయులు స్వామివారి దర్శనానికి అది సరైన సమయం కాదని వారిని లోపలికి పంపించడానికి అనుమతించరు.దీంతో దీంతో ఆగ్రహానికి గురైన ఋషులు ద్వారపాలకులైన జయ విజయులను ఏ స్వామి వారి సన్నిధిలో అయితే ఉన్నావని గర్వపడుతున్నారో,అతని సేవకు దూరమవుతారని శపించారు.

 Unknown Facts About Varahavataram-విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విషయం తెలుసుకున్న విష్ణువు జయ విజయములతో మహా మునుల శాపం మీరరానిది నా పట్ల మిత్ర భావంతో ఉండి ఏడు జన్మల తరువాత తిరిగి వైకుంఠం చేరుకుంటారా?లేక నాతో శత్రుత్వం పెంచుకొని నా చేతిలో మరణించి మూడు జన్మలకు తిరిగి వస్తారా…? అని అడుగగా జయ విజయులు స్వామివారి కోసం మూడు జన్మలే కోరుకుంటారు.ఈ విధంగా జయవిజయులు స్వామి వారి పట్ల ఉన్న భక్తిని చూసి చలించి పోయిన మునులు ఎలాగైనా తమను మన్నించమని స్వామివారిని వేడుకుంటారు.

ఆ విధంగా మునుల శాపం వల్ల జయ విజయములు భూమిపైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిగా అవతరిస్తారు.హిరణ్యాక్షుడు రాక్షసులకు రాజై, విష్ణువును ఎదుర్కొని జయించడానికి కంకణం కట్టుకున్నాడు.హిరణ్యకశిపుడు విష్ణువును కవ్వించే ఘోరకృత్యాలు చేసి, ఏకంగాభూమిని దొర్లించుకుపోయి రసాతల సముద్రంలోకి తోశాడు.భూమి రసాతలం అడుగున మునిగిపోవడంతో భూదేవి విష్ణువును తలంచి తన్ను ఉద్ధరించమని మొరపెట్టుకుంది.

ఈ నేపథ్యంలోనే బ్రహ్మదేవుడు నిర్వహిస్తుండగా యజ్ఞం నుంచి ఉద్భవించిన అవతారమే వరాహ అవతారం.

వరాహావతారం మెరుపు వేగంతో రసాతలానికి పరిగెత్తింది.

ఆ విధంగా రసాతలానికి చేరుకున్న భూమిని తన కొమ్ములతో ఎత్తి సముద్రం నుంచి బయటకు తీసాడు.అదే సమయంలో హిరణ్యాక్షుడు వరుణుడిపై దాడిచేసి పోరాటానికి పిలిచాడు.

వీరాధి వీరుడివైన నీవు నాతో కాదు,రసాతలం నుంచి భూమిని బయటకు వేసిన యజ్ఞవరాహంతో అని వరుణుడు అన్నాడు.ఆ విధంగా హిరణ్యాక్షుడు వరాహంతో యుద్ధంలో పోటీ పడతారు.

చివరికి వరాహావతారంలో ఉన్న విష్ణుమూర్తి తన కొమ్ములతో పొడిచి చంపుతాడు.దీంతో హిరణ్యాక్షుడు మరణం పొంది వైకుంఠం చేరుకుంటాడు.

ఈ విధంగా స్వామివారి వరాహవతారం ఎత్తడానికి కారణం అని పురాణాలు చెబుతున్నాయి.

#Stage Avatars #Bane #Vaikuntham #Dasha Avatars #Sages

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL