అక్కడ రోడ్లపై ముద్దు పెట్టుకుంటే జైలు శిక్ష తప్పదట...

ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ ఒకటి .అందువల్లనే ఈ దేశంలో ఉద్యోగాలు చేయడం కోసం అమెరికా, భారతదేశం బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, తదితర దేశాల నుంచి ఎక్కువ మంది వలస వెళుతుంటారు.

 Unknown Facts About United Emirates Of Dubai, United Emirates Of Dubai, Dubai Un-TeluguStop.com

అయితే డబ్బులు సంపాదించడానికి ఈ దేశం అనువైన మార్గం అయినప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి కఠిన చట్టాలను గురించి తెలుసుకోకుండా అక్కడికి వెళితే మాత్రం కచ్చితంగా చిక్కుల్లో పడినట్టే.

ముఖ్యంగా ఈ దేశంలో పెళ్లికాక ముందు ఎవరు కూడా యువతీ యువకులు శృంగారంలో పాల్గొన కూడదు.

అంతేకాకుండా పెళ్లయిన భార్య భర్తలు అయినా సరే బహిరంగ ప్రదేశాల్లో ఒకరిపై ఒకరు చెయ్యి వేసుకుని నడవకూడదు. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పోలీసులు కంట పడితే జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ చట్టం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు కూడా వర్తిస్తుంది.  పాపం ఈ విషయం తెలియక ఆ మధ్య ఓ ప్రేమ జంట బహిరంగంగా ముద్దు పెట్టుకుంటుండగా  పోలీసులకు చిక్కారు.

దీంతో వారిని దాదాపుగా నెల రోజుల పాటు జైల్లో ఉంచారు.అయితే ఈ దేశంలో మహిళలకు మరియు వారు పాటించే సాంప్రదాయాలని ప్రజలు ఎక్కువగా గౌరవిస్తారు.

  దాంతో వారిపై ఇష్టం లేకుండా బలవంతంగా ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడినా మరణ శిక్ష తప్పదు.కానీ రాత్రుల సమయంలో మాత్రం “లేడీస్ నైట్” అనే పేరుతో కొంత మంది సంపన్నుల కుటుంబాలు పార్టీలను నిర్వహిస్తారు.

 ఈ పార్టీలలో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి కాల్ గర్ల్స్ శృంగారంలో పాల్గొనడం, డాన్సులు చేయడం, మద్యం సేవించడం వంటివి చేస్తుంటారు.

అయితే ఈ దేశపు కరెన్సీ దినార్.

ప్రపంచ దేశాల కరెన్సీలతో పోలిస్తే దుబాయ్ దినార్లకు విలువ చాలా ఎక్కువగానే ఉంటుంది.అయితే ఇక్కడ ఎక్కువగా  చమురు బావులను ఆర్థిక వనరులుగా పరిగణిస్తారు.

అంతేకాక ఈ దేశంలో మంచి నీళ్ల కంటే పెట్రోలు చాలా చౌకగా దొరుకుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube