మూడు తొండాలు, ఆరు చేతులతో దర్శనమిచ్చే వినాయకుడు ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

Unknown Facts About Trishund Mayureshwara Temple

సాధారణంగా మనం వినాయకుడు అనగానే ఒక తొండం నాలుగు చేతులు కలిగి ఉన్నటువంటి విగ్రహం మనం చూసి ఉంటాం.అదేవిధంగా వినాయకుడికి వాహనంగా పక్కనే చిన్న ఎలుక కూడా ఉంటుంది.

 Unknown Facts About Trishund Mayureshwara Temple-TeluguStop.com

కానీ మీరు ఎప్పుడైనా మూడు తొండాలు, ఆరు చేతులు కలిగినటువంటి వినాయకుని చూశారా? కానీ పుణేలోని సోమ్వార్‌లేన్‌లో గల త్రిశుండ్ మయూరేశ్వర మందిరానికి వెళితే అక్కడ మనకు మూడు తొండాలు, ఆరు చేతులు, నెమలి వాహనం పై ఆసీనుడు అయినటువంటి వినాయకుడు మనకు దర్శనమిస్తారు.ఈ విధంగా మూడు తొండాలు కలిగిన వినాయకుడి విశిష్టత ఇక్కడ తెలుసుకుందాం.

పూనేలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లా నజగిరి అనే నదీ తీరంలో ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం.భీమజీగిరి గోసవి అనే వ్యక్తి నిర్మించాడు.1754లో మొదలుపెట్టిన ఈ ఆలయంలో 1770 సంవత్సరంలో పూర్తయి మూడు తొండాలు కలిగినటువంటి వినాయకుడిని ప్రతిష్టించారు.అదే విధంగా ఈ ఆలయం గర్భగుడి లోపల మూడు భాషలలో శాసనాలను గుర్తించారు.

 Unknown Facts About Trishund Mayureshwara Temple-మూడు తొండాలు, ఆరు చేతులతో దర్శనమిచ్చే వినాయకుడు ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రెండు శాసనాలు సంస్కృతంలో ఉండగా మూడవ శాసనం పర్షియన్ భాషలో ఉంది.

మన దేశంలో ఏ ఆలయంలో లేని విధంగా ఈ ఆలయంలో వినాయకుడు ప్రత్యేకమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు.ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు వారి జీవితంలో విజయ పథంలో ముందుకు సాగాలని స్వామి వారిని వేడుకుంటారు.అదే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించిన గోసవి సమాధిని కూడా ఈ ఆలయ ప్రాంగణంలోనే నిర్మించారు.

ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం కింది భాగంలో ఎల్లప్పుడూ నీరు నిల్వ ఉండే విధంగా కొలను కట్టారు.ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండే ఈ కొలను గురు పౌర్ణమి రోజు ఈ కొలను ఖాళీ చేసి ఉంచడం వల్ల ఈ ఆలయ నిర్మించన గోసవి సమాధిని దర్శించుకుంటారు.

అదేవిధంగా సంకటహర చతుర్దశి రోజు ఈ ఆలయాన్ని పెద్ద ఎత్తున భక్తులు సందర్శించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.వినాయక చవితి ఉత్సవాలను కూడా ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

#Vinayaka #Pune #Mayureshwara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube