టీ చరిత్ర గురించి మీకు తెలుసా? మన దేశంలోకి ఎలా వచ్చిందంటే..

టీ చరిత్ర చాలా పురాతనమైనది.దీని మూలం చైనాకు చెందినదని భావిస్తారు.

 Unknown Facts About Tea, Tea,tea History,british,dutches, Tea In India,tea Garden,tea Facts-TeluguStop.com

కొన్ని నివేదికల ప్రకారం 2700 బీసీలో చైనీస్ పాలకుడు షెన్ నంగ్ తన తోటలో కూర్చుని వేడినీరు తాగుతున్నప్పుడు అతని కప్పులో ఒక చెట్టు ఆకు పడిపోయింది.ఫలితంగా ఆ నీటి రంగు బంగారు రంగులోకి మారింది.

సువాసన కూడా వచ్చింది.షెన్ నంగ్ ఆ రుచిని ఆనందంగా ఆస్వాదించాడు.

 Unknown Facts About Tea, Tea,Tea History,British,Dutches, Tea In India,Tea Garden,Tea Facts-టీ చరిత్ర గురించి మీకు తెలుసా మన దేశంలోకి ఎలా వచ్చిందంటే..-Evergreen-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టీ ఇలా మొదలైందని చెబుతారు.బౌద్ధ సన్యాసులు టీ తాగడాన్ని ప్రారంభించారని కూడా చెబుతారు.వారు దీనిని ఔషధంగా ఉపయోగించారు.1610వ సంవత్సరంలో డచ్ వ్యాపారులు చైనా నుండి యూరప్‌కు టీని తీసుకువెళ్లారని, క్రమంగా ఇది ప్రపంచం మొత్తానికి ఇష్టమైన పానీయంగా మారిందని చెబుతారు.భారతదేశానికి టీ తెచ్చిన ఘనత బ్రిటిష్ వారిదే.

ఈస్టిండియా కంపెనీ 1834లో టీని భారతదేశానికి తీసుకువచ్చింది. అస్సాంలో 1835లో తేయాకు తోటల పెంపకం చేపట్టారు.అస్సాం టీ దాని బలమైన వాసన, రంగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

అస్సాంతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ ప్రాంతంలో పండించే టీ అత్యంత రుచికరమైనదిగా పేరొందింది.ప్రపంచంలో టీ ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది.2021లో టీ ఎగుమతులు 19.55 మిలియన్ కిలోలుగా ఉన్నాయి.అంతకుముందు 2020లో ఇది 20.97 మిలియన్ కిలోలుగా ఉంది.గత 12 నెలల కాలంలో టీ ఎగుమతుల విలువ దాదాపు రూ.5246.89 కోట్లు.అంతర్జాతీయ టీ దినోత్సవం మొదటిసారిగా 2005లో ఢిల్లీలో నిర్వహించారు.ప్రస్తుతం పలు దేశాల్లో టీ ఉత్పత్తి జరుగుతోంది.2015 సంవత్సరంలో, భారత ప్రభుత్వం టీ ప్రాముఖ్య‌త‌ను ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థలకు తెలియ‌జేసింది.దీని తరువాత ప్రపంచంలోని వివిధ దేశాలలో మే 21 న టీ డే జరుపుకోవడం ప్రారంభించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube