హృతిక్ రోషన్ ని సైతం కదిలించిన ఆ తెలుగు సినిమా ఏంటో తెలుసా.. ?

కె.విశ్వనాధ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా స్వయం కృషి.ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్ గా నటించారు.ఈ సినిమా స్టోరీని జంధ్యాల చేతికి ఇచ్చేయడంతో హాస్యం,ఎమోషన్ మేళవించిన డైలాగ్స్ రాశారు.ఈ చిత్రానికి ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా వ్యవహరించారు.ఇక ఈ సినిమాలో హీరో చిరంజీవి చెప్పులు కుడుతూ ,రేడియోలో హిందీ పాటలు వింటూ,చనిపోయిన చెల్లెలు కొడుకుని పెంచుకుంటూ,పెద్ద షూ షోరూం పెట్టేస్తాయికి ఎదగాలని కలలు కనే సాధారణ మనిషిగా చూపించారు.

 Unknown Facts About Svayam Krushi-TeluguStop.com

ఇక సినిమా స్టార్టింగ్ లోనే సాంబయ్య పాత్రతో చెప్పులు కుట్టగా వచ్చిన డబ్బులు లెక్కపెడుతూ కలలోకి జారుకుంటారు.అయితే కలలో అతడు షూ షోరూంలో చెప్పులు సర్దుతూ కనిపిస్తారు.

కాగా.అలా ఒక్క షాట్ లోనే విశ్వనాధ్ ఏమి చెప్పాలో అదే చెప్పేస్తాడు.

 Unknown Facts About Svayam Krushi-హృతిక్ రోషన్ ని సైతం కదిలించిన ఆ తెలుగు సినిమా ఏంటో తెలుసా.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాదు.మరో పాత్ర గంగ గా విజయశాంతి నటన కూడా చిరంజీవికి సరిజోడీగా ప్రేమానురాగాలు, ఎమోషనల్ సీన్స్ పండిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇక సాంబయ్య పడేకష్టంలో గంగ తోడుగా నిలుస్తూ ఉంటుంది.

Telugu Chirenjeevi, Hruthik Roshan, Movie, Shoe Mart, Svayam Krushi, Tollywood, Unknown Facts About Svayam Krushi, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

ఈ మూవీలో మరదలిని సాంబయ్య ప్రేమిస్తే, ఆమె మరొకర్ని ప్రేమిస్తుంది.కాగా.తాను ఎదుగుతూ తనతో ఉన్న పదిమంది ఎదగాలని సాంబయ్య కోరుకుంటారు.

ఇక కిందపడ్డప్పుడు ఎలా లేవాలో ఈ సినిమాలో చూపించారు.అంతేకాదు.

తాను ఎదిగిన తర్వాత తన మేనల్లుడు కూడా కష్టపడి ఎలా ఎదగాలో నేర్పించే క్రమంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించే సాంబయ్య పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు.అయితే మేనల్లుడు తనని విభేదించి వెళ్ళిపోతే కోపం వచ్చిన సాంబయ్య తన షూమార్ట్ కి వెళ్లి చెప్పు కుట్టడం చేస్తారు.

Telugu Chirenjeevi, Hruthik Roshan, Movie, Shoe Mart, Svayam Krushi, Tollywood, Unknown Facts About Svayam Krushi, Vijayashanthi-Telugu Stop Exclusive Top Stories

ఇక ఆస్తి మొత్తం చిన్న పిల్లాడి పేరున రాసేసి,మళ్ళీ చెప్పులు కుట్టుకోడానికి చెట్టుకిందకి వెళ్లిపోవడం ద్వారా తమ మూలలను మర్చిపోలేదని తెలియజేశారు.అంతేకాదు.శ్రమలోని ఔనత్యాన్ని ఈ చిత్రం ద్వారా విశ్వనాధ్ తెరకెక్కించారు.ఈ సినిమాతో చిరంజీవికి తొలిసారి నంది అవార్డు అందుకున్నారు.ఇక తన జీవితంలో ఒక్క సినిమా అయినా కె విశ్వనాధ్ డైరెక్షన్ లో చేయాలని హృతిక్ రోషన్ ఓ ఇంటర్యూలో చెప్పడం చూస్తే, విశ్వనాధ్ గొప్పతనం మనకు తెలుస్తోంది.

#Shoe Mart #Hruthik Roshan #Svayam Krushi #Svayam Krushi #Vijayashanthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు