సినిమా ఇండస్ట్రీలో హీరోలకి ఏవిధంగానైతే క్రేజ్ ఉంటుందో అదే విధంగా సోషల్ మీడియా ద్వారా కూడా ఇప్పుడు చాలామంది విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఒకప్పుడు హీరోలు మాత్రమే చాలా గ్రేట్ గా అభిమానులు చూసే వాళ్లు కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని టిక్ టాక్ ద్వారా కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కొంతమంది వెబ్ సిరీస్ ల ద్వారా కొంతమంది ఇలా చాలామంది రోజు రోజుకి మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంటూ మంచి గుర్తింపు పొందుతున్నారు.
అలాంటి వాళ్లలో షణ్ముఖ్ జస్వంత్ ఒకడు ఆయన చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ పొందాడు.ముఖ్యంగా ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి అని చెప్పాలి ఇదిలా ఉంటే యూట్యూబ్ లో ఎప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తో కానీ డాన్స్ వీడియోలు గాని పోస్ట్ చేస్తూ ఉంటాడు.
అలాగే టిక్ టాక్ తో ఫేమస్ అయిన దీప్తి సునయన తో కలిసి చాలా సాంగ్స్ లో కూడా నటించాడు అయితే దీప్తి సునైనా బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు ఎక్కువగా షణ్ముఖ్ జస్వంత్ పేరు ప్రస్తావించడంతో అతను అప్పుడే చాలా పాపులర్ అయిపోయాడు.ప్రస్తుతం నటిస్తున్న సూర్య వెబ్ సిరీస్ లో మిడిల్ క్లాస్ యూత్ ఎలా ఉంటారు మనీ లేకుండా ఎన్ని ఇబ్బందులు పడతారు అనే విధంగా వల్ల కష్టాలని మనకు అర్ధం పట్టేలా చూపిస్తూ మనలో ఒకడిగా మంచి గుర్తింపు పొందుతున్నాడు.
అలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అయితే సూర్య వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తున్న మౌనిక రెడ్డి గురించి చాలా మందికి తెలియదు.ఆవిడ ఈటీవీ ప్లస్ లో ఒక సీరియల్ లో నటించి నటిగా మంచి గుర్తింపును సాధించింది.ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ మంచి మార్కులు కొట్టేస్తుంది.అయితే మౌనిక రెడ్డిది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి దగ్గర కొలిపరలో 1994 ఏప్రిల్ 10న మౌనిక జన్మించింది మౌనిక రెడ్డి వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉండేవాడు.
అమ్మ రాణి ఇంటి దగ్గరే ఉండి పిల్లల బాగోగులు చూసుకుంటూ వుండేది తన స్కూలింగ్ అంతా తెనాలి కృష్ణవేణి టాలెంట్‌లో పూర్తి చేసింది .తరువాత వైజాగ్ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ తిరుపతి విద్యానికేతన్ కాలేజీ నుంచి బీటెక్ వైజాగ్ విజ్ఞాన్ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసింది.హైదరాబాద్ హెచ్‌జిఎస్ కంపెనీలో హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేసింది.
అయితే ఉద్యోగం చేస్తున్నప్పుడే వెబ్ సిరీస్‌లో అవకాశాలు రావడంతో ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా కొన్ని ఎపిసోడ్స్‌లో నటించింది.
ఆ తర్వాత కొద్దిరోజులకు జాబ్‌కు రిజైన్ చేసి వెబ్ సిరీస్ సూర్యలో షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి నటిస్తోంది.ఇందులో తన నటనకు గాను మంచి మార్కులే పడుతున్నాయి వెబ్ సిరీస్ ద్వారా నెలకు దాదాపు రూ.50 వేలు సంపాదిస్తోందట మౌనిక అలాగే ఇప్పుడున్న యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటిగానే కాకుండా స్టార్ గా కూడా ఎదిగే ప్రాసెస్ లో మౌనిక రెడ్డి ఉన్నారు అని చెప్పొచ్చు.
ఎందుకంటే ఆవిడకి చాలామంది అభిమానులు ఇప్పటికే ఉన్నారు కాబట్టి ఆవిడ వెబ్ సిరీస్ ల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంటూ అలాగే డబ్బులు కూడా సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఎప్పటికైనా తెలుగు తెరపై నటించి మంచి గుర్తింపు సాధించుకొని ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగాలని అప్పట్లో తెలుగు నుంచి వచ్చిన హీరోయిన్స్ టాప్ హీరోయిన్స్ గా ఎదిగిన విషయం మనం చూశాం అలాగే ఆవిడ కూడా మంచి హీరోయిన్ గా రాణించాలని కోరుకుందాం…
.