ఆసుపత్రి బెడ్ నుంచి సుహాసిని కి పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన చారు హాసన్

ప్రముఖ నటి సుహాసని. అద్భుత దర్శకుడు మణిరత్నం ఇద్దరు మూడు ముళ్ల బంధం ద్వారా ఒక్కటయ్యారు.

 Unknown Facts About Suhasini And Maniratnam Marriage, Maniratnam, Suhasini, Suha-TeluguStop.com

అయితే వీరి పెళ్లి ఎలా జరిగింది? ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? పెద్దలు కుదిర్చారా? లేక ప్రేమించుకున్నాక పెద్దలు ఒప్పుకున్నారా? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది.ఇంతకీ వీరి పెళ్లి ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.1988 ఆగష్టులో వీరి పెళ్లి జరిగింది.వారికి నందన్ అనే అబ్బాయి ఉన్నాడు.

1988 జూన్‌లో సుహాసిని తండ్రి చారు హాస‌న్‌కు వెన్నునొప్పి సమస్య ఏర్పడింది.దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ మాటల మధ్య డిసెంబర్ నుంచి సినిమాలు ఒప్పుకోవద్దని తన కూతురికి చెప్పాడు చారు హాసన్.తను ఎందుకు అలా చెప్తున్నాడో సుహాసినికి అర్థం కాలేదు.

నీ గురించి, మణిరత్నం గురించి వదంతులు వస్తున్నాయి.ఈ విషయం గురించి నేను జీవీ(మణిరత్నం సోదరుడు) మాట్లాడుకున్నాం.

ఓసారి మణిరత్నాన్ని కలిసి మాట్లాడు అని చెప్పాడు.మణితర్నం అంటే సుహాసినికి ఎంతో ఇష్టం.

తనను ఎలా కలిసి మాట్లాడాలి?అనుకుంది.తన ఫ్రెండ్ ఫోన్ చేసి మాట్లాడమని చెప్పింది.

అనుకున్నట్లుగానే తనకు ఫోన్ చేసింది.మాట్లాడారు.

Telugu Arranged, Pain, Chaaru Haasan, Bed, Legendary, Maniratnam, Suhasini, Toll

కాసేపట్లో కలుస్తానని చెప్పాడు.అర గంట తర్వాత సుహాసిని వాళ్ల ఇంటికి వచ్చాడు.పలు విషయాల గురించి మాట్లాడుకున్నారు.రెండు కుటుంబాల పెద్ద‌ల మ‌ధ్య సంప్ర‌తింపులు కొనసాగుతున్నాయి.అన్ని అనుకున్నట్లే జరిగాయి.ఇద్దరి పెళ్లి ఆగష్టు 25, 1988 నాడు జరిగింది.

వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమే.

Telugu Arranged, Pain, Chaaru Haasan, Bed, Legendary, Maniratnam, Suhasini, Toll

మణిర‌త్నం వాళ్ల ఇల్లు, సుహాసిని వాళ్ల ఇంటి ప‌క్క‌ వీధిలోనే.అయినా వారిద్దరు అంతకు ముందు ఎప్పుడూ కలుసుకోలేదు.మ‌ణిర‌త్నం సినిమా ప‌ల్ల‌వి అనుప‌ల్ల‌వి అనే కన్నడ సినిమా సందర్భంగా ఏర్పడింది.

ఆ సినిమాలో హీరోయిన్ గా చేయాలని అడిగేందుకు తనే స్వయంగా సుహాసిని వాళ్ల ఇంటికి వచ్చాడు.అయితే డేట్స్ ఖాళీగా లేని కారణంగా తను నో చెప్పింది.

ఆ తర్వాత తనతో పలు సినిమాలు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube