మీటింగ్ పెట్టి మరి.. నటీనటులకు క్లాస్ పీకిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడుగా కొనసాగుతూ ఉన్నారు నందమూరి తారక రామారావు. ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రేంజిలో ఏకంగా తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన.

 Unknown Facts About Sr Ntr Details, Senior Ntr, Akkineni Nageswara Rao, Producer-TeluguStop.com

ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఎంతోమంది ప్రేక్షకులకు పౌరాణిక పాత్రలు రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలను గుర్తు చేయగానే అందరికీ గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు అని చెప్పాలి.అంతలా ఏకంగా తన నటనతో పాత్రలకు ప్రాణం పోసేవారు నందమూరి తారక రామారావు.

అయితే నందమూరి తారక రామారావు ని ప్రేక్షకులు అభిమానులు ఎన్టీఆర్ అని పిలుచుకునేవారు.

అయితే నందమూరి తారకరామారావు నటసార్వభౌముడుగా ఎదగడానికి ఆ బిరుదు రావడానికి చాలా సమయం పట్టింది.

ఇక ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలోని నటీనటుల ఆలోచన మొత్తం మారిపోయింది.ఎందుకంటే అన్నగారు ఎప్పుడు నిబద్ధతకు పెద్దపీట వేసే వారట.

సినిమా నిర్మాతలకు అమితమైన గౌరవం ఇచ్చేవారట.అంతకు ముందు ఉన్న నటులు మాత్రం ఇక నిర్మాతలు మా వల్లే కదా బ్రతుకుతుంది అన్న విధంగా వ్యవహరించేవారట.

కానీ అన్నగారు మాత్రం ఎంత పెద్ద హీరో అయినా కూడా సరైన సమయానికి షూటింగ్ స్పాట్ రావడం.ఇక నిర్మాతలు వస్తే ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకోవడం చేసేవారట.

Telugu Nandamuritaraka, Ntr Anr, Ntr, Producers, Senior Ntr, Sr Ntr, Tollywood-M

అయితే ఒకానొక సమయంలో అప్పట్లో టాప్ హీరోగా ఉన్న అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి చెన్నైలో పెద్ద సభ ఏర్పాటు చేశారు అన్నగారు.ఈ క్రమంలో నటీనటులు అందరిని కూడా పిలిచి నిర్మాతలను ఎలా గౌరవించాలి ఇక షూటింగ్ సమయంలో ఎంత నిబద్ధత తో ఉండాలి అనే విషయంలో ఏకంగా క్లాస్ పీకారట.అంతేకాదు ఇక షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అక్కడికి నిర్మాత వస్తే మాత్రం నమస్కారం చేసి రిసీవ్ చేసుకునే వారట ఎన్టీఆర్.ఇలా ఎంత గొప్ప నటుడిగా ఎదిగినప్పటికీ ఆయన మాత్రం ఎంతో ఒదిగి ఉండేవారట.

గ్రూపు పెట్టడం, గొడవకు దిగడం, తోటి నటులను విమర్శించడం, లాంటి వాటికి అన్నగారు ఆమడదూరంలో ఉండేవారట.ఇప్పటికీ ఎంతోమంది ఎన్టీఆర్ బాటలోనే పయనిస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube