జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో మనం మోసం పోతాం.తెలుగు సినిమా పరిశ్రమలో మకుటంలేని మహరాజుగా ఎదిగిన ఎన్టీఆర్ సైతం ఓసారి మోసపోయాడు.
ఆయనను మోసం చేసింది ఓ నకలీ డాక్టర్.ఇంతకీ ఆయన ఎలా మోసపోయాడో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు సినిమా పరిశ్రమ రోజు ఇలా కొత్తపుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుందంటే.దానికి కారణం ఎన్టీఆర్ లాంటి నటులు అని చెప్పక తప్పదు.ఎన్నో రకాల జానపద,పౌరాణిక, చారిత్రక సినిమాలు తీసి.తెలుగు సినిమా స్థాయిని పెంచాడు ఎన్టీఆర్.
సినిమాలతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆయన జీవితం ఎందరికో ఆదర్శప్రాయం అని చెప్పుకోవచ్చు.ఆయనను ఓ నకిలీ వైద్యుడు మోసం చేయడం విశేషం.
సుబ్బారావు డైరెక్షన్ లో తెరకెక్కిన పల్లెటూరి పిల్ల అనే సినిమా చేశాడు.ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కు గాయం అయ్యింది.
కుడిచేతికి దెబ్బ గట్టిగా తగలడంతో ఆయన స్పృహ కోల్పోయాడు.వెంటనే ఎన్టీఆర్ కు ట్రీట్మెంట్ చేయించాలి అనుకున్నారు.
దగ్గర్లో ఉన్న వైద్యుడిని సెట్ కు రప్పించారు.అతడు ఎన్టీఆర్ ను పరిచయం చేసుకున్నాడు.
తాను పుత్తూరు వైద్యుడినని వచ్చిన వ్యక్తి చెప్పాడు.గాయపడిన చేతికి కట్టుకట్టాడి.
అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.అయితే ఎంతకీ ఎన్టీఆర్ చేతి నొప్పి తగ్గలేదట.
పైగా చేయి మరింత బరువు ఎక్కినట్లు అనిపించిందట.
అటు మరో డాక్టర్ ను పిలిపించి గాయాన్ని చూపించారట.
మొదట తనకు వైద్యం చేసిన వ్యక్తి నకిలీ వైద్యుడని చెప్పాడట అసలు డాక్టర్.ఆయన కట్టిన కట్లన్నీ విప్పేసి.
తాజాగా కట్టుకట్టడంతో ఎన్టీఆర్ చేతినొప్పి తగ్గిందట.దీంతో నకిలీ డాక్టర్ పై ఎన్టీఆర్.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడట.అటు డూప్ తో చేయిద్దామని చెప్పినా వినకపోవడం పట్ల దర్శక నిర్మాతలు సైతం కాస్త అసహనం వ్యక్తం చేశారు.
అనంతరం ఈ పాత్రను డూప్ తో చేయించి కంప్లీట్ చేశారట.