పాపం SP బాలు.. ఆనాడు నీళ్ల కోసం అర్థగంట ఎదురు చూశాడట..? 

చిత్ర పరిశ్రమలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.దేశనలుమూలాల ఎక్కడకు వెళ్లిన ఆయన స్వరం మనకు వినిపిస్తూనే ఉంటుంది.

 Unknown Facts About Sp Balasubramanyam Waited Half An Hour For Water Details-TeluguStop.com

ప్రస్తుతం భౌతికంగా ఆయన మనతో లేకపోవచ్చు.కానీ, మహానుభావుడు పాడిన పాటలు, ఆయన గాత్రం, ఎన్నో మధురమైన గీతాలు విన్నప్పుడు ఆయన మనతోనే ఉన్నాడనే అనుభూతిని కలిగిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

సినీ ఇండస్ట్రీలో గానగంధర్వుడిగా ఆయనకు పేరుంది.ఎన్నో భాషల్లో వేల సంఖ్యలో పాటలు పాడాడు.అశేశమైన ప్రేక్షక అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ఎస్పీ బాలు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన బాలు అనతి కాలంలోనే సంగీతంలో మంచి పట్టు సాధించారు.

 Unknown Facts About Sp Balasubramanyam Waited Half An Hour For Water Details-పాపం SP బాలు.. ఆనాడు నీళ్ల కోసం అర్థగంట ఎదురు చూశాడట.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత పరిశ్రమలో 4 దశాబ్దాల పాటు తిరుగులేని సింగర్‌గా పేరు ప్రఖ్యాతలను కైవసం చేసుకున్నాడు.అయితే, బాలు జీవించి ఉన్న సమయంలో తమిళనాడులోని చెన్నైలో అరబకెట్ నీళ్ల కోసం 3 గంటలు ఎదురుచూడాల్సి వచ్చిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరోనాకు ముందు తమిళ ప్రజలు విపరీతంగా నీటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Telugu Chennai, Chennai Water Scarcity, Corona, Legendary Singer Sp Balasubramanyam, Sp Balasubramanyam Waited Half An Hour For Water, Sp Balu, Sp Balu Waited For Water, Tamil Nadu, Unknown Facts-Movie

అప్పుడు చెన్నైలో ఉన్న బాలు స్వయంగా తాను ఎదుర్కొన్న నీటి కష్టాలను సన్నిహితులతో వివరించారట.కేవలం అరబకెట్ నీళ్ల కోసం అర్ధగంట సేపు వేచి ఉండాల్సి వచ్చిందని వాపోయారట.జీవితంలో నీటికి ఎంతో ప్రాధాన్యత ఉందని, అందుకే పొదుపుగా వాడుకోవాలని ఆ తర్వాత చాలా సభల్లో చెప్పారని తెలిసింది.

నీటి సమస్య ఎందుకు వచ్చిందో కూడా ఆనాడు కారణం చెప్పారట.

Telugu Chennai, Chennai Water Scarcity, Corona, Legendary Singer Sp Balasubramanyam, Sp Balasubramanyam Waited Half An Hour For Water, Sp Balu, Sp Balu Waited For Water, Tamil Nadu, Unknown Facts-Movie

అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనవచ్చని చెప్పారు.ఆహారం ప్లేట్‌లో తినేకంటే పేపర్ ప్లేట్ తినాలని.అప్పుడు దానికి కడగడానికి నీరు వృథా కాదని సెలవిచ్చారట.

అదేవిధంగా రోజుకు ఒక షర్ట్ వాష్ చేయడం కంటే వారానికి రెండు జతల బట్టల చొప్పున వేసుకుంటే వాటిని ఉతకడానికి అయ్యే నీరు చాలా సేవ్ అవుతుందని తెలిపారు.చివరగా నీటి సంక్షోభం తలెత్తడానికి మానవులే కారణమని.

ముందు వెనుక ఆలోచించకుండా నీటిని వృథా చేస్తే భవిష్యత్ తరాలు ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుందని స్పష్టంచేశారు.

#SP Balu #ChennaiWater #Corona #Chennai #Balu Water

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు