అరుదైన నటి స్మితా పాటిల్ గురించి మీకు తెలుసా? 

బాలీవుడ్ నటి స్మితా పాటిల్. 31 ఏళ్ల వయసులో మరణించినప్పటికీ ఆమె సినిమాల్లో చేసిన పాత్రల ద్వారా ఇంకా బతికి ఉందనే చెప్పొచ్చు.

 Unknown Facts About Smitha Patil Details, Smitha Patil, Bollywood Legendary Actr-TeluguStop.com

కాన్పు అనంతరం జరిగిన కాంప్లికేషన్స్ వల్ల స్మితా పాటిల్ ప్రాణాలు కోల్పోయింది.అయితే, స్మితా పాటిల్ సినిమాల్లో పోషించిన పాత్రలు చాలా గొప్పవని సినీ పరిశీలకులు చెప్తున్నారు.

స్వయంగా స్త్రీ వాద ఉద్యమాల్లో పాల్గొన్న స్మితా పాటిల్.అభ్యుదయ పాత్రలు పోషించేందుకుగాను ఎప్పుడూ ముందుంటుంది.

ప్రాత నచ్చితే చాలు.రెమ్యునరేషన్ అవసరం లేకుండానే సినిమాలు చేసేస్తుంది.

అటువంటి గ్రేట్ యాక్ట్రెస్‌ను మళ్లీ బహుశా ఎవరూ చూడొచ్చని పలువురి అభిప్రాయం.

బాలీవుడ్ డైరెక్టర్ మహేశ్ భట్ తన సినిమాలో నటించాలని బతిమాలాడు.

అలా మహేశ్ భట్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాకు అవార్డు కూడా వచ్చింది.ఇకపోతే స్మితా పాటిల్‌లో ఏదో శక్తి ఉందని స్వయంగా అమితాబ్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం.

ఓ రోజు హోటల్‌లో ఉన్నపుడు రాత్రి రెండు గంటల సమయంలో అమితాబ్‌కు స్మితా పాటిల్ ఫోన్ చేసి బీ కేర్ ఫుల్ సర్ అని చెప్పిందట.తనకు ఓ పీడకల వచ్చిందని పేర్కొందట.

అయితే, ఆ తర్వాత రోజు సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగి నిజంగానే అమితాబ్ బచ్చన్ గాయపడ్డాడు.

Telugu Amitab Bachchan, Bhoomika, Mahesh Bhatt, National Award, Pregnancy, Smith

అలా స్మితా పాటిల్ మాటలు నిజమయ్యాయని అమితాబ్ పేర్కొన్నాడు.హిందీ, బెంగాళీ, మరాఠి, గుజరాతి, మలయాళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన స్మితా పాటిల్.మహానటి‌గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది.

ఈమె నటించిన ‘మంథన్, నమక్ హలాల్, భూమిక, బజార్, వారిస్, జెట్ రె జెట్, ఆక్రోశ్, ఆజ్ కి అవాస్, మండి’ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి.

Telugu Amitab Bachchan, Bhoomika, Mahesh Bhatt, National Award, Pregnancy, Smith

‘భూమిక’ చిత్రంలో ఉషా పాత్ర పోషించిన స్మితా పాటిల్‌కు నేషనల్ అవార్డు లభించడం విశేషం.ఇకపోతే స్మితా పాటిల్ చనిపోయిన తర్వాత ఆమె నటించిన దాదాపు డజన్ సినిమాలు విడుదలయ్యాయి.అవన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube