బాలు మహేంద్ర దర్శకత్వంలో కమల్ హాసన్, శ్రీదేవి కలిసి నటించిన సినిమా మూండ్రం పిరై.ఈ చిత్రాన్ని తెలుగులో వసంత కోకిల’గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఈ మూవీలో సిల్క్ స్మిత కూడా కీలక పాత్రలో నటించారు.అయితే మూండ్రం పిరై’లో కమల్, స్మితపై ఓ పాట అనుకున్నారు.
ఇక తమిళంలో “పొన్మేని ఉరువుదే” అనే పల్లవితో ఆ పాట ఉంటుంది.చిత్ర యూనిట్ ఈ పాటను ఊటీలో చిత్రీకరించారు.
అయితే స్మిత ఊటీ వెళ్లడం అదే మొదటిసారి.ఇక వారు ఊటీ వెళ్లిన సీజన్ ఎలాంటిదీ అంటే.కాళ్లూ, చేతులూ కొంకర్లు పోయే డిసెంబర్ నెలలో వెళ్లారు.సాధారణంగానే ఊటీలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటాయి.
ఇక అలాంటిది డిసెంబర్‌లో అక్కడి వాతావరణం, చలి ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు.అయితే ఊటీలో కురిసే మంచు యథాతథంగా అత్యంత సహజంగా స్పష్టంగా తెరపై కనిపించాలన్నది బాలు తాపత్రయం.
ఇక దాని కోసం ప్రతిరోజూ ఉదయం ఆరున్నర గంటలకు ముందు, సాయంత్రం ఆరున్నర దాటిన తర్వాత షూటింగ్ జరపడానికి టైమ్ ఫిక్స్ చేశారు బాలు.
కాగా.
అప్పుడు స్మిత పాట్లు చూడాలి మరి.ఇక పాట నాగరాలో ప్రారంభమయ్యేసరికి ఆమె కాళ్లలోంచి వణుకు మొదలైంది.

స్మిత చలికి పైగా కాళ్లకు చెప్పులు లేకుండా నృత్యం చేయాల్సి ఉంది.ఆ చలిలో డాన్స్ చేస్తుంటే రాళ్లు కాళ్లలోకి గుచ్చుకుపోయి ఉంటె.మరోవైపు డాన్స్ డైరెక్టర్ సుందరం మాస్టర్ “ఎన్నమ్మా స్మితా” అంటూ తొందరపెట్టే వారంట.దాంతో ఆమె పరిస్థితి వర్ణనాతీతం.

ఇక షూటింగ్ నుంచి హోటల్ రూమ్‌కు వచ్చిన తర్వాత ఆమె ఆలోచనలో పడ్డారు.ఇక ఆమె మనసులో “ఏలూరు నుంచి వచ్చి ఇలా సినిమా నటిగా గుర్తింపు తెచ్చుకున్నాను.అయితే నటిగా ఇన్ని కష్టాలు పడాలా? ఇన్ని కష్టాలు పడటం నా వల్ల సాధ్యమవుతుందా? ఈ కష్టాలన్నీ పడే బదులు ఊరెళ్లిపోతే బాగుండును కదా” అనుకున్నారంట.విజయం సాధించాలంటే ఏ రంగంలో కష్టాలు తప్పవు అనుకోని మరుసటిరోజు త్వరగా షూటింగ్ కి వెళ్లరు.
ఈ సినిమా స్మితకి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది.
