షావుకారు హీరోగా ఏఎన్నార్ స్థానంలో ఎన్టీఆర్ ఎందుకు వచ్చాడో తెలుసా?

షావుకారు.తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుత సినిమా.ఎన్టీఆర్ ను హీరోగా నిలబెట్టిన సినిమా.హీరోయిన్ జానకికి ఇంటిపేరుగా మారిన సినిమా.అయితే ఈ సినిమా విషయంలో చాలా ఆసక్తికర విషయాలు జరిగాయి.తొలుత ఈ క్లాసిక్ సినిమాలో హీరోగా అక్కినేని నాగేశ్వర్ రావును అనుకున్నారు అయితే దర్శకుడు చక్రపాణికి ఏఎన్నార్ తో సినిమా చేయడం ఇష్టం లేదు.

 Unknown Facts About Shavukar Movie Ntr Anr Details, Shavukar Movie, Sr Ntr, Shav-TeluguStop.com

అందుకే ఎల్వీ ప్రసాద్ ఈ సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు చేసుకున్నప్పుడల్లా.చక్రపాణి ఏదో ఒక వంక చెప్పి సినిమా షూటింగ్ జరగకుండా చూసేవాడు.

అలా రెండుసార్లు జరిగింది.మరో నిర్మాత నాగిరెడ్డి సినిమా షూటింగ్ గురించి ఎల్వీ ప్రసాద్ ను అడిగేవాడు.

ఓ రోజు ఎల్వీ ప్రసాద్ మీద సీరియస్ అయ్యాడు.నాగిరెడ్డి గారు.

సినిమా ఆలస్యం గురించి చక్రపాణి గారిని అడగాలని చెప్పాడు.నాగిరెడ్డికి ఏం జరుగుతుందో తెలియక చక్రపాణి వైపు చూశాడు.

చక్రపాణి చిన్నగా నవ్వి.ప్రతి సినిమా కథకు ఓ ఆత్మ ఉంటుంది.అందుకే ఆ ఆత్మ అభిరుచికి తగిన హీరోను సెలెక్ట్ చేయాలి అని చెప్పాడు.దానికి నాగిరెడ్డి చిరాకు పడ్డాడు.

అసలు విషయం చెప్పాలన్నాడు.ఈ సినిమా హీరోను మార్చాలా? అక్కినేనికి ఏమైంది? అని ప్రశ్నించాడు.ఈ కథకు ఫామ్ లో ఉన్న హీరో కాదు.కథనే ఫామ్ లోకి తెచ్చే హీరో కావాలి అని చెప్పాడు.అంటే రామారావు ఓకేనా అన్నాడు.అవును అన్నాడు చక్రపాణి.

Telugu Classical, Chakrapani, Lv Prasad, Nagi, Shavukar, Shavukar Janaki, Sr Ntr

ఈ సంభాషణ జరిగిన కొద్ది రోజులకు రామారావు, జానకి హీరో హీరోయిన్లుగా సినిమా షూటింగ్ మొదలయ్యింది.తక్కువ కాలంలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.1950 ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదలైంది.అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.

అయితే క్లాసిక్ సినిమాగా మిగిలిపోయింది.సినిమా అయితే ఆడలేదు గానీ.

రామారావుకు మంచి గుర్తింపు తెచ్చింది.ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube