ఆ పని చేసి అప్పుల పాలైన నటి గిరిజ.. ఏమైందంటే..?

ఇప్పటితరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా కొన్ని దశాబ్దాల క్రితం హాస్యనటిగా గిరిజ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రేలంగి గిరిజ జంటగా కామెడీ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి.

 Unknown Facts About Senior Comedian Girija, Senior Comedian Girija, Actress Gir-TeluguStop.com

నవ్వితే నవరత్నాలు, పాతాళ భైరవి, ధర్మ దేవత, భలే రాముడు, భలే అమ్మాయిలు, అప్పుచేసి పప్పుకూడు, భట్టి విక్రమార్క ఇలా 100కు పైగా సినిమాల్లో గిరిజ కీలక పాత్రల్లో నటించారు.

తొలితరం హాస్యనటి అయిన గిరిజ కామెడీ రోల్స్ తో పాటు గయ్యాళి రోల్స్ లో కూడా నటించారు.

అప్పటి హీరోయిన్లకు సమానంగా క్రేజ్ ను సొంతం చేసుకున్న గిరిజ ఒకవైపు హాస్యనటిగా చేస్తూనే ఎన్టీఆర్, ఏఎన్నార్, మరి కొందరు హీరోలకు జోడీగా కూడా నటించారు.గిరిజకు 17 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలోనే తల్లి మరణించగా ఆ తరువాత ఆమె సన్యాసిరాజు అనే సినీ డైరెక్టర్ ను వివాహం చేసుకున్నారు.

Telugu Actressgirija, Career Problems, Girija, Relangi Girija, Senior, Senior Gi

రేలంగి గిరిజ జోడీ కోసం దర్శకనిర్మాతలు ప్రత్యేకంగా కామెడీ ట్రాకులు రాయించేవారు. గిరిజ పారితోషికం కూడా భారీగానే ఉండేది.పెళ్లి జరిగిన తరువాత గిరిజ భర్త సన్యాసిరావు ఆమె సంపాదించిన డబ్బుతో సినిమాలను నిర్మించారు.సీనియర్ ఎన్టీఆర్ తో భలే మాస్టర్.పవిత్ర హృదయాలు అనే సినిమాలను నిర్మించగా ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

Telugu Actressgirija, Career Problems, Girija, Relangi Girija, Senior, Senior Gi

నిర్మాతగా వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో గిరిజకు అప్పులు మిగిలాయి.చివరకు ఆమె అద్దె ఇంటికి దీనస్థితిలోకి వెళ్లారు.ఎంతోమందిని నవ్వించిన గిరిజ కష్టాలను అనుభవిస్తూ మరణించడం గమనార్హం.

కొందరు సహనటీమణులు ఆమెకు తమవంతు సహాయం చేశారు.అయితే ఆమె కూతురు మాత్రం సినిమాల్లో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

మలయాళంలో సలీమా పేరుతో గిరిజ కూతురు నటించారు.గిరిజ కూతురు అసలు పేరు శ్రీరంగ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube