రజినీకాంత్ సిగరెట్ తాగే స్టైల్ ఎలా నేర్చుకున్నారో తెలుసా.?   Unknown Facts About Rajinikanth Smoking Style     2018-12-01   11:23:21  IST  Sainath G

స్టైల్ అనగానే మనకి గుర్తొచ్చేది సూపర్ స్టార్. కృషి ఉంటె మనుషులు ఋషులవుతారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. బస్సు కండక్టర్ నుండి సూపర్ స్టార్ గా ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే మంచి మనసున్న వ్యక్తి. ఇటీవలే రజిని నటించిన రోబో 2 ఓ ప్రేక్షకులముందుకు వచ్చింది. కలెక్షన్స్ పరంగానే కాదు ఆడియన్స్ ప్రశంసలు అందుకోవడంలో కూడా హిట్ కొట్టింది. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలుకొడుతూ సక్సెస్ వైపు దూసుకెళ్తుంది.

నరసింహ సినిమాలో రజిని ఆటిట్యూడ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సిగరెట్ వెలిగించడంలో ఆయన స్టైల్ వేరు. ఫాన్స్ అందరు ఫిదా అయిపోవాల్సిందే. నిజజీవితంలో సాదాసీదాగా ఉన్నా ప్రతి సినిమాలో తన స్టైల్ కంటిన్యూ చేస్తారు రజిని. ఆయన సిగరెట్ కాల్చే స్టైల్ ఎలా నేర్చుకున్నారు అనేది ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Unknown Facts About Rajinikanth Smoking Style-Director Shankar Rajani Kanth Style Satrugnasinha

రజనీకాంత్ బెంగళూరులో ఉన్న సమయం నుంచే సిగరెట్‌ను స్టైల్‌గా వెలిగించేందుకు ప్రయత్నించేవారట.

‘మొదటిసారి బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా ఇలాంటి స్టైల్‌ను ఓ హిందీ సినిమాలో ప్రదర్శించారు. అప్పటి నుంచి దాని మెరుగుపరచుకోవడం మొదలు పెట్టాను’ అని రజనీకాంత్ అన్నారు. అద్దం ముందు నించొని ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేసారంట రజిని.

Unknown Facts About Rajinikanth Smoking Style-Director Shankar Rajani Kanth Style Satrugnasinha

అది స్టైలే కానీ దానికి టైమింగ్ చాలా ముఖ్యం. అది కేవలం విసరడం, పట్టుకోవడం లాంటిది కాదు. మొదట సన్నివేశం, సంభాషణను అర్థం చేసుకొని ఏ సమయంలో దాన్ని నోటితో పట్టుకోవాలో అర్థం చేసుకోవడం చాలా అవసరం’ అని రజనీ తన నైపుణ్యం గురించి వివరించారు. అలాగే తన నడక, వేగం గురించి మాట్లాడుతూ.. ‘అదంతా సహజంగా అబ్బిందే. వాటిని నేను సహజంగానే చేస్తాను. కానీ ప్రజలు స్టైల్ అంటారు’ అని చెప్పుకొచ్చారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.