సహాయం చేయడం లో రాజబాబు ని మించిన మనిషి లేడు.. ఎందుకో తెలుసా?

రాజబాబు.హాస్య నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా వెలిగాడు.

 Unknown Facts About Rajababu Helping Nature , Rajababu, Tollywood, Comedian, Hel-TeluguStop.com

ఎన్నో చక్కటి సినిమాల్లో తన హాస్యంతో జనాలను కడుపుబ్బా నవ్వించాడు.సినిమాల్లో కామెడీ పాత్రలు చేసిన ఆయన బయట మాత్రం ఎంతో గొప్ప మనిషి.

ఎదుటి వారికి మేలు చేయడమే తప్ప ఏనాడూ పల్లెత్తు కీడు తలపెట్టిన వాడు కాదు.దాహం వేస్తే నీళ్లు ఇచ్చిన వారిని సైతం గుర్తు పెట్టుకుని.

సాయం చేసిన మంచి మనిషి రాజబాబు.రెండు దశాబ్దాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా సత్తా చాటినా..ఏనాడు ఎవరితో చిన్న తగాదా కూడా పడలేదంటే ఆయన ఎంత మంచితనంతో మెలిగేవాడో అర్థం చేసుకోవచ్చు.

రాజబాబు అంటే సినిమా పరిశ్రమలో అందరూ చాలా ఇష్టపడేవారు.ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపేవారు.

రాజబాబుతో పాటు కలిసి నటిస్తున్నాం అని చెప్పుకునే వారు.తన జీవితాన్ని స్కూల్ టీచర్ గా మొదలు పెట్టిన ఆయనకు మిమిక్రీ అంటే బాగా ఇష్టం ఉండేది.చేసేవాడు కూడా.ఆ తర్వాత నాటకాలపై మనసు మళ్లింది.అక్కడ కూడా మంచి ప్రతిభ కనబర్చాడు.నెమ్మదిగా మద్రాసుకు సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

తొలుత చిన్నా చితకా వేశాలు వచ్చినా.ఆ తర్వాత మంచి పాత్రలు పోషించి టాప్ కమెడియన్ గా ఎదిగాడు.

ఆయన డేట్లు కూడా దొరకని పరిస్థితి చాలా సార్లు ఎదురైంది.

Telugu Narture, Rajababu, Tollywood, Rajababu Nature-Telugu Stop Exclusive Top S

సినిమాల మూలంగా ఎంతో డబ్బు సంపాదించిన రాజబాబు.ఎంతో మందికి మేలు చేశాడు.సొంత ఖర్చులతో ఎంతో మంది పేదవారికి వివాహాలు జరిపించాడు.

సేవా సంస్థలకు భూరి విరాళాలు ఇచ్చేవాడు.చాలా మంది పేద పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాడు.

అంతేకాదు.మద్రాసులో సినిమా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు దాహం వేస్తే నీళ్లు ఇచ్చిన వాచ్ మెన్ ను గుర్తు పెట్టుకుని.

తనను వెతుక్కుంటూ వెళ్లి మరీ ఆర్థికసాయం చేసిన గొప్పమనిషి రాజబాబు.ఆ వాచ్ మెన్ మరెవరో కాదు.

రాజసులోచన ఇంటి వాచ్ మెన్.పేద పారిశుధ్య కార్మికులకు, రిక్షా తొక్కేవాళ్లకు భూమి కొని ఉచితంగా అందించాడు.

సొంత డబ్బుతో కాలేజీ కట్టించి పేదలకు అంకితం చేశాడు.సినిమాల్లో వచ్చిన చాలా డబ్బును పేదల మంచి కోసమే ఇచ్చాడు మహానుభావుడు రాజబాబు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube