విగ్రహాలముందు నేరుగా నిలబడి ప్రార్థించకూడదు..! ఎందుకు?   Unknown Facts About Prayer     2017-10-05   22:52:51  IST  Raghu V

సాధారణంగా మనం ఉదయం లేవగానే మన ఇష్ట దైవానికి నమస్కారం చేస్తూ ఉంటాం. కొంత మంది ఉదయం లేవగానే స్నానం చేసి గుడికి వెళుతూ ఉంటారు. ఈ విధంగా గుడికి వెళ్లి దేవుణ్ణి ప్రార్థించుకోవడం వలన మనసు ప్రశాంతంగా ఉండటమే కాకా కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. అందువల్ల గుడికి వెళ్ళటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

అయితే గుడికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు కోరికలు తీరాలనే కాంక్షతో దేవుని విగ్రహం ముందు నిల్చొని నమస్కారం చేస్తూ తమ కోరికలను చెప్పుతూ ఉంటారు. కానీ శాస్త్ర ప్రకారం ఈ విధంగా చేయటం చాలా తప్పు. దేవుని విగ్రహానికి నేరుగా నిల్చోకుండా ఎడమ వైపు గాని కుడి వైపు గాని నిల్చొని ప్రార్థించుకోవడం ద్వారా దేవానుగ్రహం లభిస్తుంది.

అదెలా అంటే.. దేవతావిగ్రహాల నుంచి వెలువడే ‘‘దైవకృపా శక్తి’’ తరంగాల రూపంలో ప్రవహిస్తూ, భక్తుని దగ్గరకు చేరుకుంటాయి. అటువంటి సమయంలో మానవదేహం సూటిగా విగ్రహానికి నిలబడితే.. ఆ దివ్యకిరణాలను తట్టుకోవడం అసాధ్యం. కొన్ని సందర్భాలలో అది హానికరంగా మారవచ్చు. కాబట్టి విగ్రహాలకు సూటిగా కాకుండా.. ఎడమ లేదా కుడివైపున నిలబడి ప్రార్థిస్తే.. దైవానుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా దేవుడిని ప్రార్థించే సమయంలో రెండు చేతులను జోడించి, భక్తిశ్రద్ధలతో నమస్కారం చేస్తే మెదడుకు ప్రాణశక్తి లభిస్తుంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.