ఆకాశంలో ఉత్తరం వైపు కనిపించే ధ్రువనక్షత్రం వెనుక గల కారణం ఏమిటో తెలుసా?

Unknown Facts About Polar Star

ఆకాశంలో ఇప్పటికీ మనకు ఉత్తరం దిక్కున కనిపించే ధ్రువనక్షత్రం వెనుక ఎంతో కథ ఉంది.ధ్రువ నక్షత్రం సాక్షాత్తు శ్రీహరి వరం చేత ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి.

 Unknown Facts About Polar Star-TeluguStop.com

అసలు ధ్రువ నక్షత్రం ఏర్పడటానికి గల కారణం ఏమిటి దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.పురాణాల ప్రకారం ఉత్తానుపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు కలరు వారిలో పెద్ద భార్య సునీత, వీరికి కలిగిన సంతానమే ధ్రువుడు.

రెండవ భార్య సురుచి వీరికి కలిగిన సంతానం ఉత్తముడు.ఉత్తానుపాదుడు పెద్ద భార్య సునీత కంటే సురుచి దగ్గర ఎక్కువగా గడిపేవారు.

 Unknown Facts About Polar Star-ఆకాశంలో ఉత్తరం వైపు కనిపించే ధ్రువనక్షత్రం వెనుక గల కారణం ఏమిటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకోసమే మొదటిభార్య సంతానం తన తండ్రితో ఎక్కువగా గడపాలని కోరిక ఉండేది.

ఈ సమయంలోనే ఒక రోజు తన తండ్రితో ఎంతో సంతోషంగా గడపాలని ద్రోణుడు తన పినతల్లి ఇంటికి వెళ్తాడు.

అప్పుడు అక్కడ తన తండ్రి ఒడిలో తన తమ్ముడు కూర్చుని ఉన్నాడు.ఈ క్రమంలోనే ధ్రువుడు ఎంతో సంతోషంతో తన తండ్రి దగ్గరికి వెళ్ళగానే తన తండ్రి అతన్ని చూసి చీదరించుకున్నాడు.

దీంతో అతనికి దుఃఖం గలేదు అప్పుడు తన పినతల్లి ఎంతో కఠినంగా నీవు కూడా నా కడుపున పుట్టి ఉంటే మీ తండ్రిగారి ప్రేమను పొందే వాడివి ఇప్పటికైనా నిన్ను నా కడుపున పుట్టించమని ఆ శ్రీహరిని ప్రార్థించు అని సురిచి చెప్పడంతో అక్కడి నుంచి ధ్రువుడు ఏడ్చుకుంటూ తన తల్లి సునీత వద్దకు వెళ్లి జరిగిన విషయం చెబుతాడు.

Telugu Dhruvudu, Hindu Puranas, Lard Srihari, Maha Vishnu, Polar, Pooja, Suneetha, Sunitha, Uttanupadu-Telugu Bhakthi

విషయం మొత్తం విన్న సునీత నాయనా… మీ పినతల్లి నిజమే చెప్పింది.కానీ ఒక గొప్ప ఆశయం పెట్టుకొని శ్రీహరిని ప్రార్థించు అప్పుడే ఫలితం ఉంటుందని తన తల్లి చెప్పడంతో ధ్రువుడు శ్రీహరి కోసం తపస్సు చేయడానికి వెళ్ళాడు.ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి శ్రీహరిని మనసులో తలచుకుంటూ ఒంటికాలిపై కొన్ని సంవత్సరాలు కఠిన తపస్సు చేయగా శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు.

శ్రీహరిని చూసిన ఆనందంలో ధ్రువుడు ఎన్నో స్త్రోత్రాలు చేసాడు.అప్పుడు విష్ణుదేవుడు ధ్రువ నీ మనసులో ఉన్న కోరికను నేను నెరవేరుస్తున్నానని చెబుతాడు.

Telugu Dhruvudu, Hindu Puranas, Lard Srihari, Maha Vishnu, Polar, Pooja, Suneetha, Sunitha, Uttanupadu-Telugu Bhakthi

ఇప్పటి వరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీకు కల్పిస్తున్నాను.గొప్ప మహారాజుగా, రాజ్యమేలుతూ ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు అనే వరాన్ని ప్రసాదించాడు.ఈ లోకం మొత్తం నిన్ను ధ్రువనక్షత్రంగా పిలుస్తారని విష్ణుమూర్తి చెప్పి అదృశ్యమయ్యాడు.అప్పటి నుంచి నేటికీ ఉత్తరం దిక్కున కనిపించే ఆ నక్షత్రమే ధ్రువనక్షత్రంగా పిలవబడుతుంది.

#Lard Srihari #Pooja #Maha Vishnu #Hindu Puranas #Suneetha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube