నారప్ప లో వెంకటేష్ తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా..?

తెలుగులో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల “నారప్ప” అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరో గా విక్టరీ వెంకటేష్ మరియు హీరోయిన్ గా ప్రియమణి, అమ్ము అభిరామి తదితరులు నటించారు.

 Unknown Facts About Narappa Beauty Ammu Abhirami, Narappa, Venkatesh, Ammu Abhir-TeluguStop.com

ఇటీవలె ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు “ఓ నారప్ప” అనే సాంగ్ ని విడుదల చేశారు.దీంతో ఈ పాటలో విక్టరీ వెంకటేష్ కంటే అమ్ము అభిరామి బాగా హైలెట్ అయ్యింది.

దాంతో నెటిజన్లు అమ్ము అభిరామి గురించి సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు.

అయితే నటి అమ్ము అభిరామి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది.

నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో అమ్ము అభిరామి చదువుకునే రోజుల్లోనే పలు చిత్రాలలో నటించింది.ఈ క్రమంలో 2017వ సంవత్సరంలో విజయ్ మరియు కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన “భైరవ” అనే చిత్రంలో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పాత్రలో నటించి నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తర్వాత తెలుగులో ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన “రాక్షసుడు” చిత్రంలో హీరో మేనకోడలి పాత్రలో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది.అలాగే ఇటీవలే తెలుగులో నూతన దర్శకుడు విద్యా సాగర్ దర్శకత్వం వహించిన “ఫక్ (ఫాదర్ చిట్టి ఉమ కార్తీక్)” నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించింది.

కాగా ఈ చిత్రంలో అమ్ము అభిరామి ఆడపిల్ల వర్జినిటీ విషయంపై చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది.దీంతో ప్రస్తుతం అమ్ము అభిరామి కి టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో బాగానే అవకాశాలు వరిస్తునట్లు సమాచారం.

Telugu Ammu Abhirami, Ppa, Rakshasudu, Tollywood, Venkatesh-Movie

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అభిరామి ప్రధాన పాత్రలో నటించిన “నారప్ప” చిత్రం ఈ నెల 20వ తారీకు నుంచి ప్రముఖ ఓటిటి అయిన అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది.కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న “నవరస” అనే ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube