సంగీతాన్ని ఊహించి కథలు రాసిన వ్యక్తి ముళ్లపూడి.

తెలుగు సినిమా పరిశ్రమతో పాటు సాహిత్య రంగంలోనూ అద్భుతంగా రాణించారు కొందరు రచయితలు.వారిలో ముళ్లపూడి వెంకటరమణ ఒకరు.

 Unknown Facts About Mullapudi Venkataramana, Mullapudi Venkata Ramana, Rajendra-TeluguStop.com

ఆయన రచనా రంగంలోనూ సినిమా రంగంలోనే చక్కటి హాస్యాన్ని కురిపించాడు.అద్భుత సాహిత్యంతో ఆకట్టుకునే వాడు.

ఆయన రచనల్లో అన్ని రసాలు సమపాళ్లలో ఉంటాయి.అందుకే ఆయన రచనలన్నీ జనాల్లోకి అంతగా బాగా వెళ్లగలిగాయి.

ఇక రమణ అంటే.బాపూ కూడా గుర్తొస్తాడు.వీళ్లిద్దరు కలిసి తీసిన సినిమాలు ఎంతో చక్కటి హాస్యాన్ని పంచేవి.జనాలను మనసారా నవ్వేలా చేసేవి.

వీరి మార్గ నిర్దేశంలో వచ్చిన సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం.శ్రీకాంత్ నటించిన రాధాగోపాలం.

చంద్రమోహన్ నటించిన బంగారు పిచ్చుక.సంపూర్ణ రామాయణం నుంచి శ్రీరామరాజ్యం సినిమా వరకు ఎన్నో చక్కటి చిత్రాలను తెరకెక్కించారు.

వీటిని ఎన్నిసార్లు చూసినా.మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది.

ఎందుకంటే ఇవి సినిమాల్లా కాకుండా నిజ జీవితాన్ని చిత్రకరించినట్లు ఉంటాయి.చాలా నేచురాలిటీ ఉంటుంది.

అందుకే జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి.వీరి సినిమాలకు అందించే సంగీతం కూడా చాలా చక్కగా ఉంటుంది.

పాటలు, మాటలు, సీన్లు అన్నీ కావాల్సినంత స్థాయిలో ఉంటాయి.

Telugu Bapu, Evergreen, Kanuka, Koti Kommacchi, Mullapudi, Pellipusthakam, Rajen

సినిమాలో సంగీతం గురించి ఊహించి కథలు రాసే వ్యక్తి ముళ్లపూడి ఒక్కడే అనే వారు అప్పట్లో సినీ జనాలు.అంతేకాదు.హీరోల పాత్రలను కూడా చాలా నేచురల్ గా చిత్రీకరించే వారు.

హీరోయిన్లను చాలా సంప్రదాయబద్దంగా.అంతే అందంగా చూపించేవారు.

ముళ్లపూడి రచనల్లో మంచి పేరు పొందిని కానుక, కోతి కొమ్మచ్చి మూడు భాగాలు, బాపూ రమణీయం.సినిమాల విషయానికి వస్తే.

పెళ్లి పుస్తకం.అటు పలు సినిమాలకు ఆయన రాసిన డైలాగులు అద్భుతంగా పేలాయి.సినిమా స్థాయిని ఆయన సినిమాలు ఓ రేంజికి తీసుకెళ్లేవి.ఎలాంటి డబుల్ మీనింగ్ లేకుండా చక్కటి భాషలో ఉండేవి ఆయన మాటలు.అందుకే చాలా మంది దర్శకులు ఆయనతో కావాలని డైలాగులు రాయించుకునే వాళ్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube