అందుకేనేమో మనిషి మొదట 20 ఏళ్ళు అలా ఉండి..చివరి 10 ఏళ్ళు ఇలా ఉంటున్నాడు.! జీవిత సత్యం చెప్పే కథ.!  

Unknown Facts About Man Life History -

ఒక రోజు దేవుడు ఓ కుక్కని తయారు చేసాడు.

Unknown Facts About Man Life History

దేవుడు అన్నాడు: రోజంతా ఇంటి ముందు కూర్చో.ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు.నేను నీకు 20 ఏళ్ళు ఆయుషుని ఇస్తాను.

కుక్క: స్వామి ఇదేమి బాలేదు… నేను అన్ని ఏళ్ళు అరవలెను.కాబట్టి ఇదుగో 10 ఏళ్ళు నీకు ఇచ్చేస్తాను.10 ఏళ్ళు మాత్రమే అరుస్తాను సరేనా ! దేవుడు: సరే.

అందుకేనేమో మనిషి మొదట 20 ఏళ్ళు అలా ఉండి..చివరి 10 ఏళ్ళు ఇలా ఉంటున్నాడు. జీవిత సత్యం చెప్పే కథ.-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతి ని తయారు చేసాడు.

దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోష పరుచు.నీకు 20 ఏళ్ళు ఆయుషు ఇస్తున్నాను.
కోతి: ఏంటి !! కోతి చేష్టలు 20 ఏళ్ళ ! అమ్మో! కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చింది గా ! నేను అలాగే ఇస్తాను.దేవుడు : సరే…

మరుసటి రోజు దేవుడు మరల ఒక ఆవుని తయారు చేసాడు.

దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి రోజంతా ఎండలో కస్టపడి సాయత్రం పాలు ఇస్తూ, రైతుకి సహాయం చేయి.నీకు 60 ఏళ్ళు ఆయుషు ఇస్తునాను.

ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను.నాకు కూడా 20 ఏళ్ళు ఇచ్చి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో…
దేవుడు: సరే…

తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు.

దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు.నేను నీకు 20 ఏళ్ళు ఆయుషు ని ఇస్తున్నాను.

మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20 ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి మరియు కుక్కకి ఇచిన 10 +10 మొత్తం : 80 ఏళ్ళు కావాలి…
దేవుడు: సరే…

అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు,ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు.తరవాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు.

ఆ తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవల్లు , మనవరల్లని నవ్విస్తున్నాడు.తరవాత 10 ….ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని అరుస్తుంటాడు….

మనిషి జీవితం అంటే ఇదే.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Unknown Facts About Man Life History- Related....