మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.స్థాపించిన కొద్ది రోజుల్లోనే సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మిస్తూ దూసుకెళ్తోంది.
ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తూ తనకు తానే సాటి అనేలా ముందుకు వెళ్తోంది.ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో ముందుకు వెళ్తున్న ఈ సంస్థ.2015లో వచ్చిన శ్రీమంతుడు సినిమాతో అద్భుత విజయాన్ని అందుకుంది.నిర్మించిన తొలి మూవీనే బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచింది.ఆ తర్వాత ఏడాది అంటే 2016లో జనతా గ్యారేజ్ తో మరో విజయాన్ని అందుకుంది.2018లో రంగస్థలం సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టింది.అంతేకాదు.ఈ సినిమాలతో ఆయన హీరోల కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన వారిగా నిలిపింది.
ఈ మూడు సినిమాలతో తర్వాత 2018లో వచ్చిన సవ్యసాచి సినిమా, ఆ తర్వాతే వచ్చే అమర్ అక్బర్ ఆంటొని మూవీ, 20198లో వచ్చిన చిత్రలహరి అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.2019లో వచ్చిన డియర్ కామ్రేడ్, నాని గ్యాంగ్ లీడర్ తో మళ్లీ గాడిలో పడింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ.ఆ తర్వాత వచ్చిన మత్తు వదలరా, 2021లో వచ్చిన ఉప్పెన సినిమాతో మళ్లీ హిట్స్ అందుకుంది.
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో పలు పాన్ ఇండియన్ మూవీస్ తో పాటు భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తుంది.పుష్ప, సర్కారు వారి పాట, అంటే.సుందరానికీ! సినిమాను తెరకెక్కిస్తోంది.
అటు బాబీ దర్శకత్వంలో MEGA 154, గోపీచంద్ దర్శకత్వంలో NBK 107, భవదీయుడు.! భగత్ సింగ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR 30 సహా పలు క్రేజీ ప్రాజెక్టులు సెట్స్ మీదికి వెళ్లబోతున్నాయి.
అయితే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రాలు అన్నీ స్ట్రెయిట్ మూవీసే కావడం విశేషం.ఇంతక వరకు రీమేక్స్ జోలికి వెళ్లలేదు ఈ సంస్థ.
ఇక ముందు కూడా ఇలాంటి పోకడనే ఉంటుందా? లేదా రీమేక్స్ కు తామేం దూరం కాదని నిరూపించుకుంటుందా?అనేది మున్ముందు తెలియనుంది.