వైశ్రవణుడు కుబేరుడుగా ఎలా మారాడో తెలుసా..?

ముక్కోటి దేవ దేవతలలో కుబేరుడికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది.ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సిరి సంపదలతో తులతూగాలంటే ప్రతి ఒక్కరు ఆ కుబేరుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

 Unknown Facts About Kubera-TeluguStop.com

కానీ కుబేరుడికి అంత సంపదను కలిగే అవకాశం, వరం ఏ విధంగా పొందాడో తెలుసా? అదేవిధంగా కుబేరుడినీ ముందుగా వైశ్రవణుడు అనే పేరుతో పూజించేవారు.క్రమంగా వైశ్రవణుడు కాస్త కుబేరుడిగా ఎలా మారాడో ఇక్కడ తెలుసుకుందాం…

మొదటగా కుబేరుడు రావణాసురుడి రాజ్యమైన లంకా నగరానికి అధిపతిగా ఉండేవాడు.

 Unknown Facts About Kubera-వైశ్రవణుడు కుబేరుడుగా ఎలా మారాడో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎంతో బలశాలి, శివభక్తుడైన ఆ రావణాసురుడు లంక పై దండెత్తి రావడంతో రావణాసురుడికి భయపడి, అతనితో యుద్ధానికి తలపడలేక వైశ్రవణుడు లంకా నగరాన్ని వదిలి భయంతో గంగాతీరాన ఉన్న కాశీ నగరానికి పారిపోయాడు.కాశీ నగరంలో తనకు వచ్చిన ఆపదను తల్చుకుని ఎంతో దుఃఖిస్తున్న వైశ్రవణుడు దృఢసంకల్పంతో ఆ పరమశివుడికి తపస్సు చేశాడు.

శివుడు ప్రత్యక్షం కాగా వైశ్రవణుడు తనపై రావణాసురుడు దండెత్తి తన రాజ్యాన్ని ఆక్రమించుకున్న సంగతి తెలియజేశాడు.

Telugu Boon, Kuberadu, Lanka, Pooja, Ravanasurudu, Rituals, Sivudu, Vaishnava, Vaishravanudu-Telugu Bhakthi

వైశ్రవణుడు మాటలు విన్న పరమశివుడు లంకా పట్టణం చేజారిపోయిందని నువ్వే ఏమి దిగులుపడకు, అంతకన్నా అందమైన, అపూర్వమైన నగరాన్ని నీకు కలుగుతుందని, నవ నిధులకు నువ్వే నాయకుడిగా వర్ధిల్లుతావని, అందరికంటే గొప్ప సంపన్నుడు అవుతావని శివుడు వరం ఇచ్చాడు.ఇప్పటినుంచి నీ పేరు వైశ్రవణుడు కాకుండా కుబేరుడిగా వర్ధిల్లుతారని శివుడు వరం ఇచ్చాడు.అప్పటినుంచి కుబేరుడు .రాబోయే కాలంలో సిరి సంపదలతో వర్ధిల్లుతూ, ధనవంతుల ప్రసక్తి వస్తే అందరూ నీ పేరే తలచుకుంటారు అంటూ ఆ పరమశివుడు కుబేరుడికి వరమిచ్చాడు.అప్పటినుంచి ఇప్పటివరకు సిరిసంపదలు కలగాలంటే కుబేరుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

అదే విధంగా అధిక డబ్బు ఉన్న వాళ్లను ప్రస్తుతం కుబేరులుగానే పిలవడం మనం చూస్తూ ఉన్నాం.

#Vaishnava #Ravanasurudu #Vaishravanudu #Lanka #Pooja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL