తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరు దిగ్గజ వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మద్రాసు కేంద్రంగా ఉన్న సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్రస్థానానికి చేరారు ఈ ఇద్దరు.
అందులో ఒకరు సూపర్‌స్టార్ కృష్ణ కాగా.మరొకరు కళాతపస్వి కె.విశ్వనాథ్.అయితే ఈ ఇద్దరూ సినీ రంగంలోకి ఆదుర్తి సుబ్బారావు స్కూల్ నుంచి రావడం విశేషం.
మొదట్లో సౌండ్ రికార్డిస్ట్‌గా పనిచేశారు విశ్వనాథ్.అనంతం అప్పటి టాప్ డైరెక్టర్ ఆదుర్తి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారు.
తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ఆత్మగౌరవం మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.శంకరాభరణం సినిమాతో సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపాడు.
ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు.
అటు సినిమాల్లో ట్రై చేస్తూ.
చిన్నా చితక పాత్రలు వేశాడు కృష్ణ.ఒకసారి ఆదుర్తికి కనిపించాడు.
తన నటన బాగా నచ్చడంతో సినిమా అవకాశం ఇస్తానని చెప్పాడు.అన్నట్లుగానే తేనెమనసులు సినిమాతో హీరోగా పరిచయ చేశాడు.
ఈ సినిమా బాగా ఆడటంతో త్వరలోనే అగ్రహీరోగా ఎదిగారు.ఇండస్ట్రీలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.
సూపర్ స్టార్ ఇంట్లో ఇప్పటికీ ఆదుర్తి సుబ్బారావు చిత్రపటం కనిపిస్తుంది.
అలా కృష్ణ, విశ్వనాథ్ ఇద్దరూ ఒకే గురువు దగ్గర్నుంచి వచ్చి పలు సినిమాలు చేశారు.ఈ ఇబ్బరి కాంబోలో మూవీ సినిమాలు వచ్చాయి.ప్రైవేట్ మాస్టార్, ఉండమ్మా బొట్టు పెడతా, నేరము-శిక్ష.వీటిలో ప్రైవేట్ మాస్టార్ సినిమాలో కృష్ణ నెగటివ్ రోల్ చేశాడు.మిగతా రెండు సినిమాలూ విమర్శకుల ప్రశంసలను పొందాయి.ఆ తర్వాత కాలంలో వారిద్దరు సినిమా చేయలేదు.
కొంత కాలం క్రితం ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని టాక్ వచ్చింది.కానీ ఎందుకో సినిమా రాలేదు.
ప్రస్తుతం ఆ ఇద్దరూ ఇంటికే పరిమితం అయ్యారు.కుటుంబ కథా చిత్రాల దర్శకుడు ఆదుర్తి స్కూల్ నుంచి వచ్చిన కృష్ణ.
యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకుంటే.విశ్వనాథ్.
కళాత్మక చిత్రాల దర్శకుడిగా దేశ వ్యాప్తంగా కీర్తి పొందడం నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు.