కోడి రామకృష్ణ.తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన దర్శకుడు.
ఎన్నో సినిమాలను తీసిన ఆయన పదుల సంఖ్యలోబ్లాక్ బస్టర్ హిట్లు సాధించాడు.కోడి రామకృష్ణ సినిమా అంటేనే మినిమం గ్యారెంటీ అనే స్థాయికి తీసుకొచ్చాడు ఈ దిగ్గజ దర్శకుడు.
ఆయన సినిమాల్లోని పాత్రలు సైతం చాలా ఆసక్తికరంగా ఉండేవి.ఆయన ప్రతి పాత్రను కథకు అనుగుణంగా అద్భుతంగా మలుచుకునేలా డిజైన్ చేసేవారు.
తను అనుకున్న పాత్ర అనుకున్న విధంగా వచ్చేందుకు ఎంత రిస్క్ అయినా తీసుకునే వారు.తన దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా క్యారెక్టర్ కోసం ఎంతో మంది నటులను సైతం మార్చాడు అంటే ఆయన డెడికేషన్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు.
ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం.
కోడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శత్రువు.
ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ ను చాలా అద్భుతంగా రాసుకున్నారు.అన్నిటికి మించి ఆ పాత్రలో డిఫరెంట్ మేనరిజమ్స్ చూపించారు.ప్రతి సీన్ తీసే ముందు ఆయన.ఆ క్యారెక్టర్ చేసి చూపించేవారు.అయినా ఏ నటుడు ఆయనలా నటించేవారు కాదు.అప్పటికే ఆ క్యారెక్టర్ చేయలేక.ఇద్దరు నటులను మార్చేశారు.కోడి రామకృష్ణ ఆ క్యారెక్టర్ చేస్తుంటే డైరెక్టర్ లా చేయగలమా? అని నటులు భయపడేవారు.ఆ భయంతోనే సరిగ్గా నటించలేక.సినిమా నుంచి తప్పుకున్న వారూ ఉన్నారు.ఇక ఈ పాత్రను కేవలం కోటా శ్రీనివాసరావు మాత్రమే చేయగలడు అని భావించి పిలిపించారు.
మరుసటి రోజు షూటింగ్.యాక్షన్ అని అరిచారు కోడి.ఆవేశంతో డైలాగ్ చెప్పి ఎదురుగా నిలబడ్డారు కోట.వన్మోర్ అన్నారు కోడి.మళ్లీ కట్ 4 గంటలు అయిపోయాయి.17 సార్లు వన్ మోర్ సాగాయి.కోట శ్రీనివాసరావు ఇన్ని టేకులు తీసుకోవడం అదే తొలిసారి.అప్పుడే కెమెరామెన్ గోపాలరెడ్డి వచ్చి.కోటాకు ధైర్యం చెప్పారు.మీరు చేయడలరనే నమ్మకాన్ని కలిగించారు.ఇంతలో కోడి బ్రేక్ చెప్పాడు.
కోటా కాస్త దూరంగా వెళ్లి.వెంట తెచ్చుకున్న బుడ్డీలోని తీర్థాన్ని కడుపులోకి పోశారు.
కోడీ యాక్షన్.అనగానే సీన్ సితార్ అయ్యింది.
తన నటనతో వారెవ్వా అనిపించాడు.సీన్ అయ్యా.
కడుపులో పడ్డ తీర్థం పనయ్యా ఇది అని కోటా చెప్పడంతో అంతా నవ్వారట.