కీర్తి సురేష్ అక్క గురించి.. ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్ ఎంత గుర్తింపు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో నటించి నేటి తరం సినీ ప్రేక్షకులు అందరికి కూడా కీర్తి సురేష్ అంటే సావిత్రి అన్నట్లుగానే మారిపోయింది.

 Unknown Facts About Keerthy Suresh Sister Revathi Details, Heroine Keerthy Sures-TeluguStop.com

సాదాసీదాగా సాగిపోతున్న కీర్తి సురేష్ కెరీర్ను మహానటి సినిమా కీలక మలుపు తిప్పింది.ఇక ఆ తర్వాత కీర్తి సురేష్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడమే కాదు.

కీర్తి సురేష్ కోసం కథ రాసుకుని ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది.అయితే ఇక అందం అభినయానికి కీర్తి సురేష్ కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అనేది తెలిసిందే.

అయితే ఇక సినిమాల్లో నటించింది కాబట్టి కీర్తి సురేష్ గురించి మనందరికీ తెలుసు.కానీ కీర్తి సురేష్ కి ఒక అక్క ఉందని అక్క అచ్చం కీర్తి సురేష్ పోలికలతోనే ఉంటుందనీ.

కానీ ఇప్పుడు మాత్రం రూపురేఖలు మారిపోయాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.కీర్తి సురేష్ అక్క పేరు రేవతి సురేష్.

ఒకప్పుడు అచ్చం కీర్తి సురేష్ పోలికలతో కలిగి ఉండేది.కానీ ఇటీవలి కాలంలో ఫిట్నెస్పై దృష్టి పెట్టకపోవడంతో ఒక్కసారిగా బరువు పెరిగి పోయింది కీర్తి సురేష్ అక్క రేవతి సురేష్.

ఇక ఇలా బరువు పెరిగి పోవడం వల్ల ఊహించని రీతిలో అవమానాలను ఎదుర్కొన్నారు ఆమె.

Telugu Revathi Suresh, Keerthy Suresh, Keerthysuresh, Lady, Mahanati-Movie

ఎంతో మంది బంధువులు ఎందుకు ఇంత లావు గా ఉన్నావు అంటూ కామెంట్ చేయడం తో ఎంతగానో బాధ పడేవారట.కొన్ని కొన్ని సార్లు అద్దంలో చూసుకున్నప్పుడు.నాలో ఏదో లోపం ఉంది అనిపించేది అంతలా నాపై నాకే అసహ్యం కలిగించేలా విమర్శలు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చారు ఆమె.కానీ ఇప్పుడు చెల్లెలు కీర్తి సురేష్ సపోర్టుతో ఆమె మళ్లీ నార్మల్ లుక్ లోకి వచ్చారు.వర్కౌట్ పై ఎక్కువగా దృష్టి పెట్టి బరువు తగ్గారు.

ఇటీవలే సరికొత్త లుక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆశ్చర్యపోయారు.ఇక ఇది చూసిన తర్వాత ఈ ఫోటోలో ఉన్నది అసలు రేవతి సురేష్ కాదు అంటూ కొంతమంది కామెంట్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube