తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్.
ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించాడు.విభిన్న కథలతో సినిమాలు తీసి ప్రత్యేక గుర్తింపు పొందాడు.
అప్పటి దిగ్గజ నటీనటులందరితో ఆయన సినిమాలు తీశాడు.ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టాడు.
కె విశ్వనాథ్.అప్పటి టాప్ దర్శకుడు కె.వి.రెడ్డి గుణసుందరి కథ సినిమాను జూనియర్ శ్రీరంజని హీరోయిన్ గా తీశాడు.అదే సమయంలో మద్రాసు వాహినీ స్టూడియోలో సౌండ్ డిపార్ట్ మెంట్ లో చేశారు విశ్వనాథ్.అదే సమయంలలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ షావుకారు సినిమాకు బుక్ అయ్యారు.దాదాపు వీరంగా సినిమా కెరీర్ ను అప్పుడే ప్రారంభించారు.
లెజెండరీ దర్శకుడు బి.
ఎన్.రెడ్డికి విద్యావంతులైన యువకులను ప్రోత్సహించాడు.
సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో ట్రైనింగ్ ఇచ్చాడు.ఆ తర్వాత టాలెంట్ ఉన్నవాళ్లను తనతో పనిచేసేలా మార్చుకున్నాడు.
అంతే కాదు వాహినీ స్టూడియోలో విశ్వనాథ్ తండ్రి కాశీనాథుడి సుబ్రమణ్యం కూడా పనిచేశాడు.ఆయన బిఎన్ రెడ్డి సమకాలికులు.1938లో వందేమాతరం సినిమాతో వాహిని సంస్థ మొదలైంది.అప్పటి నుంచి సుబ్రమణ్యం ఆ సంస్థలో పనిచేశారు.
ఆ కారణంగానే విశ్వనాథ్ ను బిఎన్ రెడ్డి టెక్నిషియన్ గా తీసుకున్నాడు.ఆ తర్వాత దర్శకత్వంలోకి తీసుకోవాలి అనుకున్నాడు.
బంగారు పాప, మల్లీశ్వరి సినిమాలు చేస్తున్నప్పుడు కెవి రెడ్డి, బిఎన్ రెడ్డి దగ్గర సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మార్కస్ బార్ ట్లీ తో సన్నిహితంగా ఉండేవాడు విశ్వనాథ్.సౌండ్ రికార్డింగ్ సినిమా నిర్మాణంలో ఓ భాగం అయినా.
దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు రీ రికార్డింగ్ ను విశ్వనాథ్ కు అప్పగించేవారు.ఆయనకు దర్శకత్వం మీద ఉన్న మక్కువ కారణంగానే స్వప్న సుందరి, లైలా మజ్ను, తోడి కోడళ్లు సినిమాలకు సౌండ్ రికార్డిస్టుగా పపనిచేయడంతో అక్కినేనితో సాన్నిహిత్యం పెరిగింది.
ఇద్దరు మంచి మిత్రులయ్యారు.
అటు ఆదుర్తికి మరింత దగ్గరయ్యాడు విశ్వనాథ్.మూగ మమనసులు సినిమా స్క్రిప్ట్ డిస్కర్షన్స్ లో రోజూ పాల్గొనేవాడు విశ్వనాథ్.ఆ తర్వాత ఆదుర్తికి అసోసియేట్ గా అన్నపూర్ణ సంస్థలో చేరాడు.
అందులు సుమారు నాలుగు సంవత్సరాలు పనిచేశాడు.చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి లాంటి సినిమాలకు వర్క్ చేశాడు.మూగమనసులు మూవీకి సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా చేశాడు.1966లో అక్కినేని హీరోగా అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు విశ్వనాథ్.తర్వాత తెలుగు సినిమా గర్వించే దర్శకుడిగా, లెజెండరీ డైరెక్టర్ గా కె విశ్వనాథ్ పేరు పొందాడు.