జ్యోతిలక్ష్మి అనే వేశ్య నిజంగా ఉందా.. ఆమె జీవితంలో అన్ని రహస్యాలు ఉన్నాయా?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జ్యోతి లక్ష్మి.సినిమా ప్రేక్షకులకు, సమాజానికి ఎంత సందేశం ఇస్తుందో మనసుతో ఆలోచిస్తేనే అది తెలుస్తుంది.ఈ చిత్రం మరో పదేళ్లైనా అంతే కొత్తగా.అదే సందేశాన్ని ఇస్తుంది.

 Unknown Interesting Facts About Jyothi Lakshmi Movie, Jyothi Lakshmi, Puri Jagan-TeluguStop.com

ఈ సినిమా ఎలా మొదలైంది అన్న విషయానికొస్తే.పూరీ జగన్నాథ్ కొన్ని ఏళ్ల కింద మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన మిస్సెస్ పరంకుషం అనే నవల యొక్క హక్కులు కొన్నారట.

అది కొన్నాక కొన్ని సంవత్సరాలు జ్యోతి లక్ష్మి సినిమాను తీసారట.ఈ చిత్రం ఒక వేశ్యకు సంబంధించినది.

ఇందులో ఛార్మి కథానాయికగా మారి వేశ్యగా నటించారు.ఈ సినిమా గురించి చెప్పాలంటే.

ఒక మంచి కుటుంబానికి చెందిన ఓ యువకుడు ఒక వేశ్య ప్రేమిస్తాడు.ఆ తర్వాత ఆమె ఎక్కడ ఉంది తెలుసుకొని, ఒప్పించి, చాలా సాహసం చేసి మొత్తానికి పెళ్లి చేసుకుంటాడు.

పెళ్లి తర్వాత జరిగే ఒక సంఘటనలో ఆ వేశ్య, తనని తగిన జాగ్రత్త తీసుకొమ్మని అంటుంది.అప్పుడు ఆ యువకుడు మనం పెళ్లి చేసుకున్నాం కదా, ఇక అలాంటి జాగ్రత్తలు ఎందుకు అనడంతో.

ఆ అమ్మాయి కళ్యాణానికి కండోమ్ కి లంకె పెట్టొద్దు అనే డైలాగ్ వేస్తుంది.ఆ మాట అర్ధం నిజంగా ఆలోచిస్తే.

మనకు అర్థం అవుతుంది.అక్కడ వేశ్యకు ఉన్న భద్రతా భావం అనేది బయట పడుతుంది.

ఒక మంచి అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకున్నా ఒక వేశ్యకు, ఒక స్త్రీకి కలిగింది అంటే సమాజంలో స్త్రీ ఎన్ని ఎదుర్కుంటుందో చెప్పొచ్చు.ఒక వేశ్యనే అలా అభద్రతా భావంతో ఉంది అంటే.

ఒక సామాన్య స్త్రీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది.సమాజంలో స్త్రీ స్థానం మారేంత వరకు ఈ డైలాగ్ కు ఉన్న ప్రాముఖ్యత అలానే ఉంటుందని పలువురి వాదన.

Telugu Charmi, Puri Jagannath, Jyothi Lakshmi, Malladivenkata, Tollywood-Movie

జ్యోతి లక్ష్మి సినిమాని చూస్తే.నిజానికి 100 ఏళ్ల క్రితమే వేశ్య సమస్యకి పరిష్కారం ఎలా ఉండాలి అనేది గురజాడ అప్పారావు చెప్పారు.ఆ తర్వాత పూరీ జగన్నాథ్ ఈ చిత్రం ద్వారా మరోసారి చెప్పారు.ఒక స్త్రీ సమస్యను మరో స్త్రీనే ఎలా అర్థం చేసుకోగలదో , అలాగే ఒక వేశ్య సమస్యని మరొక వేశ్యే అర్ధం చేసుకోగలదు.

అలా అర్థం చేసుకున్నప్పుడే వాళ్లే ఆ పరిష్కారాన్ని వేతుక్కో గలరు అని ఆనాడే చెప్పారు గురజాడ.ఇప్పుడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ జ్యోతి లక్ష్మి సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube